Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు పుష్ప మూవీ తో పన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ కు కనక వర్షం కురిపించింది అని చెప్పాలి.. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం చేసాడు. తెలుగులోనే కాక అన్ని భాషల్లో బాక్స్ ఆఫీస్ రికార్డుని తిరగరాసింది. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 350 కోట్ల కలెక్ట్ చేసి ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన సినిమా మొత్తాన్ని నడిపిస్తుంది. అల్లు అర్జున్ విలక్షణమైన నటన ఈ సినిమాకు ప్లస్. పుష్ప మూవీలో కథానాయికగా రాష్మీక చేసింది. ఈమె అందం అభినయం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అనసూయ, సునీల్, ఫాహద్ ఫాసిల్, ఈ సినిమాలో తమ పాత్రలకు ప్రాణం పోయటం వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్టు అయింది.
పుష్ప సినిమా తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాకు ఎటువంటి ప్రమోషన్ లేకుండానే 100 కోట్ల మైలురాయిని దాటటం హాలీవుడ్ పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ యవత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు. సుకుమార్ అల్లు అర్జున్ పాత్రను కథకు తగ్గట్టుగా చాలా పవర్ఫుల్ గా చూపించి అల్లుఅర్జున్ ను ప్రేక్షకులకి కొత్తగా చూపించాడు. ఇంతలా రికార్డులు తిరగ రాసిన ఈ సినిమా కు సీక్వెల్ గా పుష్ప2 రాబోతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులులో భారీ అంచనాలు ఉన్నాయి.
Allu Arjun : పుష్ప2 లో అల్లు అర్జున్ డేరెక్టర్ సుకుమార్ రిస్క్ చేస్తున్నడా

అయితే సుకుమార్ ఈ సినిమాలో అల్లు అర్జున్ పై ఒక ప్రయోగం చేయటానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. అల్లు అర్జున్ ను 55ఏళ్ల వ్యక్తిగా చూపిస్తూ సాహసం చేయటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అంతే కాక ఈ సినిమాలో బాన్వర్ సింగ్ షికావత్ ఆపోజిట్ గా యంగ్ హీరో పాత్రలో వేరే హీరోను అనుకుంటున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసింది. అయితే అల్లుఅర్జున్ కుండ వేరే హీరో ను యంగ్ హీరో పాత్రలో చేయటం ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి.ఈ ప్రయోగం ద్వారా సుకుమార్ రిస్క్ చేస్తున్నాడని సినీ వర్గాలు అనుకుంటున్నారు.