Aa Ammayi Gurinchi Meeku Cheppali Review : సినిమా పేరు : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి తదితరులు
ప్రొడ్యూసర్స్ : బి మహేంద్ర బాబు, కిరణ్ బెల్లంపల్లి
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
సంగీతం : వివేక్ సాగర్
విడుదల తేదీ : 16 సెప్టెంబర్ 2022
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా పేరు చాలా పెద్దగా ఉన్నట్టు అనిపించినా ఇంద్రగంటి సినిమాల పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన సినిమాలు చాలా సైలెంట్ గా, ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా అలా కథ నడుస్తూ ఉంటుంది. తాజాగా సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరి ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది తెలియాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.
Aa Ammayi Gurinchi Meeku Cheppali Review : కథ
ఈ సినిమాలో హీరోయినే హీరో. అవును… ఈ సినిమా మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. సుధీర్ బాబు ఒక డైరెక్టర్. అప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు. ఆరు సినిమాలు తీసి హిట్ కొడతాడు. మరో సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాలనుకుంటాడు. దీంతో సరికొత్త సినిమా తీయాలనుకుంటాడు. దీంతో ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథను రాసుకుంటాడు. ఆ సినిమాకు సరైన అమ్మాయి కావాలని వెతుకుతుండగా కృతి శెట్టి కనిపిస్తుంది. దీంతో తనను హీరోయిన్ గా ఫిక్స్ చేస్తాడు. ఆ సినిమాలో తనది డాక్టర్ పాత్ర. సినిమా షూటింగ్ నడుస్తుండగా మధ్యలో కొన్ని కారణాల వల్ల సుధీర్ బాబు, కృతి శెట్టి ఇద్దరూ ఒకరికి మరొకరు దూరం అవుతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. కృతి శెట్టికి ఇంట్లో నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో సుధీర్ బాబుకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కృతి ఎందుకు సినిమాను మధ్యలోనే వదిలేసింది? సుధీర్ బాబు ఏం చేస్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాలి.
విశ్లేషణ
ఏ సినిమాకు అయినా కథే బలం. ఈ సినిమాకు కూడా కథే బలం. సినిమాలోని కథే సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. ఇంద్రగంటి సినిమాలకు కథే బలం. ఈ సినిమాకు కూడా అంతే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులను అలరించాయి. కథతో పాటు ఈసారి మోహనకృష్ణ రొమాన్స్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. కామెడీ కూడా పర్వాలేదు. పాత్రలకు తగ్గట్టుగా అందరూ బాగానే నటించారు. సంగీతం కూడా బాగుంది. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కృతి శెట్టి. రొమాన్స్, కామెడీ, సుధీర్ బాబు యాక్టింగ్, పాటలు
మైనస్ పాయింట్స్
సినిమాలో కొన్న సీన్స్ అవసరమా అన్నట్టుగా ఉంటాయి. వాటిని ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కాన్సెప్ట్ బాగుంది కాబట్టి.. నిరభ్యంతరంగా వెళ్లి ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
యువతరం రేటింగ్ : 3/5