Aadikeshava : మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ తేజ్ తర్వాత చేసిన ‘ అంగరంగ వైభవంగా ‘ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా వైష్ణవ్ తేజ్ ‘ ఆదికేశవ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈరోజు (నవంబర్ 24 )న విడుదలైంది. శ్రీలీల హీరోయిన్గా నటించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ రివ్యూవర్స్ పై మండిపడ్డారు. విడుదల రోజు రివ్యూలు రాయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఆ ప్రభావమో ఏమో కానీ చాలావరకు ట్విట్టర్లో నెగటివ్ టాక్ వినిపిస్తుంది. కొంతమంది దారుణంగా ట్వీట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమా బాగానే ఉందని , కావాలనే నెగిటివ్ ట్వీట్లు పెడుతున్నారని, దయచేసి వాటిని నమ్మొద్దని ట్వీట్లు పెడుతున్నారు. ఇలాంటి సినిమా ఎలా తీశారు రా, రాడ్డు సినిమా అంటూ గోల పెట్టేస్తున్నారు, ఆ నరుకుడు ఏంటో, ఆ తీయడం ఏంటో అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఏం తీయాలని తీశాడో, ఏం చెప్పాలని ఏం చెప్పాడో, తీసిన ఆయనకైన అర్థం అవుతుందో లేదో అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా చూస్తుంటే ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక యుఎస్ లో షోలు క్యాన్సిల్ అయ్యాయని, ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో తెలియడం లేదని అంటున్నారు. జనాలు రాకపోవడంతో టికెట్స్, బుక్ కాకపోవడంతో క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. మొదటినుంచి ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చి మధ్యలో రిపేర్లు చేస్తూ వచ్చినప్పుడే జనాలకి అనుమానం వచ్చింది. మధ్యలో శ్రీ లీల గ్లామర్ స్టెప్పులు, పాటలు పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి. ప్రస్తుతానికి ట్విట్టర్ టాక్ అయితే నెగిటివ్ గానే ఉంది.