rishna Vrinda Vihari Review : సినిమా పేరు : కృష్ణ వ్రింద విహారి
నటీనటులు : నాగ శౌర్య, షిర్లీ సెటియా, వెన్నెల కిషోర్, రాధికా శరత్ కుమార్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజి తదితరులు
డైరెక్టర్ : అనీష్ ఆర్ కృష్ణ
బ్యానర్ : ఐఆర్ఏ క్రియేషన్స్
నిర్మాత : ఉషా ముల్పూరి
మ్యూజిక్ డైరెక్టర్ : మహతి స్వర సాగర్
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య.. చాలా ఏళ్ల నుంచి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకుల మన్నన పొందిన సినిమాలు అంటే ఊహలు గుసగుసలాడే, ఛలో. అశ్వద్ధామ కూడా యావరేజ్ గా ఆడింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో నాగ శౌర్య ఉన్నాడు. ఈనేపథ్యంలో ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారీ తాజాగా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా పూర్తయ్యాయి. మరి నాగ శౌర్య నటించిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Krishna Vrinda Vihari Review : కథ
బ్రాహ్మణ కుర్రాడు కృష్ణ(నాగ శౌర్య).. తను పని చేసే ఆఫీసులోనే పని చేస్తున్న అమ్మాయి వ్రింద(షిర్లీ సెటియా) తో ప్రేమలో పడతాడు. తన ప్రేమను పొందడం కోసం చాలా కష్టాలు పడతాడు. చివరకు వ్రిందను ప్రేమలో పడేస్తాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ.. పెళ్లి తర్వాత వాళ్ల జీవితాల్లో చాలా సమస్యలు వస్తాయి. వాళ్లు ప్రేమించుకొనేటప్పుడు రాని సమస్యలు.. పెళ్లి తర్వాత ఎందుకు వచ్చాయి.. ఇరు కుటుంబాలు ఎలా స్పందిస్తారు.. అనేదే మిగితా సినిమా.
విశ్లేషణ
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా నాగ శౌర్య అదరగొట్టాడు. తను ఈ సినిమాకే ప్లస్ అయ్యాడు. మరో రకంగా చెప్పాలంటే ఈ సినిమాను నాగ శౌర్య తన భుజాల మీద మోశాడు. సరికొత్త లుక్ లో కనిపించాడు. ఇక.. హీరోయిన్ గా నటించిన షిర్లీ పర్లేదు అనిపించింది. సినిమా కథ విషయంలో బలం లేనట్టుగా అనిపిస్తుంది. పేరుకు సినిమా ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. కొన్ని విషయాల్లో దర్శకుడు ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. కథనంలో బలం లేకపోవడం, ఎడిటింగ్, బలమైన పాత్రలు లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ సినిమాతో కూడా నాగశౌర్య మెప్పించలేకపోయాడు అని తెలుస్తోంది.
ప్లస్ పాయింట్స్
నాగ శౌర్య బాడీ లాంగ్వేజ్
సత్య కామెడీ ట్రాక్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్
బలంలేని కధ
ఎడిటింగ్
యువతరం రేటింగ్ : 2/5