Pawan Kalyan : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో వస్తున్న మరో భారీ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 5న భారీగా విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్నట్లు టాక్ వస్తుంది.
గాడ్ ఫాదర్ ఈవెంట్ ను సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అర్జెంటుగా అమెరికా వెళ్ళినట్లు సమాచారం. అక్కడ కొంతమంది ప్రముఖులను కలవనున్నారట. ఈ క్రమంలో పవన్ వారం రోజులపాటు అక్కడే ఉండనున్నట్టు తెలుస్తుంది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాకపోవచ్చు అని తాజాగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చిరంజీవి గాడ్ ఫాదర్ ఈవెంట్ కు రావడం లేదా…
ప్రస్తుతం ఈ సినిమాకి 45 కోట్ల ఆఫర్ వచ్చిందని అంటున్నారు. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సంస్థతో ఈ డీల్ ఓకే అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్టును యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో చేయనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అలాగే చిరంజీవి మెహర్ రమేష్ తో బోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ యంగ్ లుక్ లో సూపర్ అనిపించారు.