Nenu Meeku Baaga Kavalsinavaadini Review : సినిమా పేరు : నేను మీకు బాగా కావాల్సినవాడిని
నటీనటులు : కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిద్ధార్థ్ మీనన్, సోనూ ఠాకూర్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ తదితరులు
డైరెక్టర్ : శ్రీధర్ గాదె
ప్రొడ్యూసర్ : కోడి దివ్య దీప్తి
సంగీతం : మణిశర్మ
రిలీజ్ డేట్ : 16 సెప్టెంబర్ 2022
కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో తనేంటో.. తన సత్తా ఏంటో చాటాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా ఆశించినంత స్థాయిలో విజయం దక్కలేదు. తర్వాత ఆయన తీసిన తాజా చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ సినిమాకు కూడా డైరెక్టర్ శ్రీధర్ గాదె. ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో తన సత్తా చాటిన శ్రీధర్ మళ్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక… ఈ సినిమా తాజాగా సెప్టెంబర్ 16న రిలీజ్ అయింది. మరీ.. ఈసారైనా కిరణ్ ప్రేక్షకులను మెప్పించాడా? అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Nenu Meeku Baaga Kavalsinavaadini Review : కథ
సంజనా ఆనంద్(తేజు) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కిరణ్ అబ్బవరం(వివేక్) క్యాబ్ డ్రైవర్. ఒక రోజు తన క్యాబ్ ఎక్కుతుంది తేజు. బాగా తాగి అతడి కారు ఎక్కుతుంది. ఆ తర్వాత తన లవ్ స్టోరీని వివేక్ కు చెబుతుంది తేజు. తన కుటుంబానికి కూడా ఇప్పుడు దూరం అయ్యానని.. కేవలం తన అక్క వల్ల ఒకరి చేతిలో మోసపోయినట్టు చెబుతుంది తేజు. ఆ తర్వాత వివేక్.. తన కుటుంబానికి తేజును దగ్గర చేస్తాడు. ఇంతలో వివేక్.. తేజుకు షాకిస్తాడు. తన మీద ఇష్టం ఉంది అని తేజూ.. వివేక్ కు చెప్పేలోపే తను ఎవరో తేజుకు తెలుస్తుంది? వివేక్ కు కూడా ఒక ప్రేమ కథ ఉంటుంది. ఆ ప్రేమ కథ కూడా తేజుకు చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. వివేక్, తేజు ఒక్కటవుతారా? వివేక్ నిజంగానే క్యాబ్ డ్రైవరేనా అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది కిరణ్ గురించి. తన నటన బాగుంది. మాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. తేజూ పాత్రలో నటించిన సంజన అదరగొట్టేసింది. కిరణ్ నటన, మణిశర్మ సంగీతం కూడా సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. కానీ.. కథలో బలం లేదు. కొత్తదనం అస్సలు లేదు. కాకపోతే పాత కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. సెకండ్ హాఫ్ లో ఉన్న ట్విస్ట్ అదిరిపోతుంది. సినిమాలో కొన్ని లాజిక్స్ మాత్రం ఎవ్వరికీ అంతుపట్టవు. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
కిరణ్ నటన
మణిశర్మ సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథ
లాజిక్స్ లేని సీన్లు
యువతరం రేటింగ్ : 2.5/5