Rajamouli : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు… రాజమౌళి ప్లాన్ అదుర్స్…

Rajamouli : దర్శకుడు రాజమౌళి ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రానుందని చెప్పారు. రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుంది అనే విషయాన్ని రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో సినిమాలు తెలుగులోపాటు ఇంగ్లీష్ లో కూడా షూటింగ్ చేస్తారట.

Advertisement

Rajamouli : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు…

మహేష్ తో రాజమౌళి తీయబోయే సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఓ భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే ఏడాదికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి తన పూర్తి సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం కేటాయించి ఉన్నారు.

Advertisement
Mahesh babu act Hollywood movie with Rajamouli direction
Mahesh babu act Hollywood movie with Rajamouli direction

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథ విషయంపై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చిస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీ స్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ సినిమాలో పాత్రను బాలయ్యతో చేయించాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మధ్య అన్ స్టాపబుల్ షోలో రాజమౌళితో సినిమా చేయాలని ఉందని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో బాలయ్య పాత్ర కోసం రాజమౌళి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయించే పనిలో ఉన్నారట. మహేష్ రాజమౌళితో సినిమా చేస్తే అది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

Advertisement