IND vs PAK : ప్రపంచ కప్ లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ తలపడబోయే మ్యాచ్ కోసం యావత్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు.ఇక ఈ మ్యాచ్ ను నాలుగు గోడల మధ్య చూడడం కంటే డీజే హోరులో భారీ తేరల పై చూడాలని చాలామంది ఉవ్విళుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుండి మొదలవబోయే భారత్ పాక్ మ్యాచ్ కోసం హోటల్లు కన్వెన్షన్ల సెంటర్లలో వీక్షించేందుకు వీలుగా భారీ తేరలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా వీకెండ్ లో రావడంతో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చాలామంది వారి స్నేహితులతో కలిసి చిల్ అవుతూ మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా సిద్ధమయ్యాయి. ఇక హైటెక్స్ లో ఇప్పటివరకు మనం డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకోవడం చూసాం.ఇక ఇప్పుడు భారత్ పార్క్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం తో పాటు డీజే సందడితో మరింత జోష్ పెంచనున్నారు. ఇక ఈ వేడుకల్లో హీరోయిన్ శ్రియ కూడా పాల్గొని ఆంధ్ర క్రికెటర్లకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇప్పుడు దసరా సెలవులు రావడంతో పిల్లల సైతం ఈ మ్యాచ్ ను వీక్షించేందుకుు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా భారీ తేరలపై మ్యాచ్ ను వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ విజయం సాధిస్తే దసరా నవరాత్రుల్లోనే దీపావళి పండుగను కూడా జరుపుకోవడం ఖాయం. ఇక అహ్మదాబాద్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం చాలామంది క్రికెట్ అభిమానులు టికెట్స్ బుక్ చేసుకుని మ్యాచ్ వీక్షించేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇక వీరిలో పలువురు సినీ నటులతో పాటు వ్యాపారవేత్తలు ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈరోజు అహ్మదాబాద్ స్టేడియం అంతా సెలబ్రిటీలతో తలుక్కున మెరవనుంది.