Lavanya Tripathi : గత కొన్ని నెలల నుండి మెగా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేడుక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల పెళ్లి. ఇక వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుని ఇటీవల పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఎన్ని వార్తలు వచ్చిన మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అంటూ కాలన్నీ గడిపి ఇప్పుడు ఇంట్లో పెద్దలను ఒప్పించి చక్కగా పద్ధతిగా పేదల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతేకాక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా ఇటీవల చిరంజీవి ఇంట్లో జరిగింది . అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ తర్వాత మెగా కుటుంబంలో రాంచరణ్ కి కూతురు పుట్టడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తే నిహారికకు విడాకులు జరగడం కొంత బాధ కలిగించే సంఘటన అని చెప్పాలి.
ఇక అప్పటినుండి అందరూ నిహారిక గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక కూడా మరిన్ని సినిమాలను చేస్తూ తన వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.ప్రస్తుతం ప్రశాంతత కోసం నిహారిక పరుగులు తీస్తోంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిహారిక ఒక విషయంలో చాలా ఆలోచిస్తుందట. వరుణ్ తేజ్ పెళ్లికి వచ్చిన బంధువులంతా నిహారిక విడాకుల గురించి ప్రశ్నిస్తారేమో అని ఆ సమస్యను ఎదుర్కోవటం చాలా కష్టంగా ఉంటుందని నిహారిక వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఏడుస్తుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి నిహారిక కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఇలా నువ్వు ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే మా పెళ్ళికి రావాల్సిన పనిలేదని చెప్పిందట.
జనాలు , ప్రపంచం ఏమంటుంది అనే విషయాలను పక్కనపెట్టి ఆనందం కోసం ని కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ప్రయత్నించు అంటూ చెప్పుకొచ్చిందట. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది నీ మంచి కోసమే తీసుకుంటావు కదా.. ఎదుటివారి మాటలను ఎందుకు పట్టించుకుని బాధపడుతుంటావు అని అడిగిందట. నువ్వు ధైర్యంగా ఉండి మా పెళ్ళిలో నిన్ను ఎవరైనా ప్రశ్నించిన సరే ధైర్యంగా సమాధానం చెప్పగలిగితే మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంటుందనిలావణ్య చెప్పుకొచ్చింది. లావణ్య త్రిపాఠి మరియు నిహారిక మంచి స్నేహితులన్న సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిహారిక కి లావణ్య మంచి సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.