India vs Australia : ఇందూర్ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంది. 99 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించిందిి. ఈ సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే మొదట బరిలో దిగిన భారత్ నిర్దేశిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. పొట్టి కప్ బరిలో ఆస్ట్రేలియాపై ఇంతటి భారీ స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. అనంతరం బరిలో దిగిన ఆస్ట్రేలియా కు 9 ఓవర్ల ఆట పూర్తి అయినాక వర్షం కాస్త అంతరాయం కలిగించింది.
దీంతో ఆటను 33 ఓవర్లకు కుదించి 317 పరుగులను లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఇక ఈ లక్ష్య చెదనలో ఆస్ట్రేలియా కేవలం 28.2 ఓవర్లలో 217 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్లు దాటికి 140 పరుగులకే 8 వికెట్లను కోల్పోయిన కంగారోలు కాస్త కంగారుపడ్డారు. కానీ ఆల్ రౌండర్ సీన్ అబాట్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి కాస్త ఊరట కలిగించాడు. ఇక టాఫ్ ఆర్డర్ ఓపెనర్ గా దిగిన వార్నర్ 39 బంతుల్లో 53 పరుగులు చేయగా, లబు షేన్ 28 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇక భారత బౌలర్స్ జడేజా ,అశ్విన్ చలో 3 వికెట్లు తీసుకోగా ప్రసిద్ధ్ కృష్ణ 2 , షమీ 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు.
ఇక భారత్ బేటర్స్ విషయానికి వస్తే ఓపెనర్ శుబ్ మాన్ గిల్ 97 బంతుల్లో 104 , శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి సెంచరీలతో చెలరేగిపోయారు. కెప్టెన్ కే ఎల్ రాహుల్ (38 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్ లతో 52 ) , సూర్య కుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫొర్లు 6 సిక్సుల తో 72 పరుగులు) చేసి అర్థ శతకాలు సాధించారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 31 పరుగులు చేసి దూకుడుగా కనిపించాడు. దీంతో టీమ్ ఇండియా ఆసీస్ పై భారీ ఘనవిజయాన్ని సాధించింది.
That's that from the 2nd ODI.
Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8
— BCCI (@BCCI) September 24, 2023