World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా టీమిండియా టైటిల్ కోసం ఆదివారం నుండి తన వేటను ప్రారంభించనుంది. ఇక మొదటి దశలోనే 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీం తో భారత్ తలపడనుంది. రెండు జట్లు బలమైనవి కావడంతో అభిమానులలో కూడా ఆసక్తి విపరీతంగా పెరిగింది. అయితే ఈ మ్యాచ్ చెన్నై వేదికగా ఆదివారం 8-10-23 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్ శుబ్ మన్ గిల్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం శుబ్ మన్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా త్వరలోనే కోల్కుంటాడని ద్రావిడ్ పేర్కొన్నారు.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ ,శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉండటం టీమిండియా కు ఎంతో అవసరం. కానీ ఇప్పుడు శుబ్ మన్ డెంగ్యూ బారిన పడి తొలి మ్యాచ్ లోనే దూరమవడం పై సందేహాలు నెలకొన్నాయి. ఇక అతను స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా బలిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ తో పాటు , డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్ , జోష్ హజల్ వుడ్, స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ తో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా కనిపిస్తుంది.
అయితే ఇటీవల ఇరుజట్ల మధ్య 3 వన్డే సిరీస్ జరగగా టీమిండియా 2-1 తో దానిని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలా అని ఆస్ట్రేలియా ని తక్కువ అంచనా వేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో ప్రతి ఒక్కరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్ కు ఆస్ట్రేలియా కు మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే ఎంతో ఆత్రుతగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్ ,ఎదురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం వచ్చే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా…అదే సమయానికి వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రాంతీయ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే శనివారం రోజు కూడా చెన్నైలో అతి భారీ వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా 8 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ వర్షం ఎలాంటి తావుకు దారి తీస్తుందో వేచి చూడాలి.