Viral Video : గులాబీ రంగు సరస్సు ఎప్పుడైనా చూశారా….దాని వెనకున్న మిస్టరీ ఏంటంటే….?

Viral Video  : ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన విశేషాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే వాటిని వీడియోలు రూపంలోనూ ఫోటోల రూపంలోనూ చూడగలుగుతున్నాం. అయితే ప్రకృతిలోని ఎన్నో వింతలు విచిత్రాలకు సంబంధించిన ఆక్సక్తికరమైన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఓ పింక్ సరస్సు కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే గులాబీ రంగులో ఉన్న ఈ సరస్సు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఆ సరస్సులో నీరు అంతా గులాబీ రంగులోనే ఉంటుంది. ఇక ఈ వింతను చూసేందుకు పర్యాటకులు సైతం తరచుగా ప్రదేశానికి వెళుతుంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

Advertisement

have-you-ever-seen-a-pink-lake-what-is-the-mystery-behind-it

Advertisement

రష్యాలోని సైబీరియాలోని ఆల్టాయి పర్వతప్రాంతాలలో ఈ గులాబీ రంగు సరస్సు కనిపిస్తుంది. ఇది ఒక ఉప్పు నీటి సరస్సు. అయితే ఈ సరస్సులోని ఉప్పు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో గులాబీ రంగులోకి మారుతుంది. అయితే ఇలా మారడానికి ఒక బలమైన కారణమే ఉందని పరిశోధకులు తెలియజేశారు. సరస్సులో ఉండే ఆర్టీమియా సాలీనా అనే సూక్ష్మజీవుల కారణంగా ఆ నీటిలోని ఉప్పు మరియు నీరు పింక్ రంగులోకి మారుతుందని నిర్ధారించారు. ఆర్టీమియా సాలీనా అనేది ఉప్పు నీటిలో ఉండే రొయ్యల జాతి. ఇక ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సరస్సు అడుగు భాగంలో నివసిస్తున్నాయి.

have-you-ever-seen-a-pink-lake-what-is-the-mystery-behind-it

ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఈ సూక్ష్మజీవులు కారణంగా ఈ సరస్సులోని నీరు గులాబీ రంగులోకి మారుతుంది. ఇక ఈ విషయాలను Trukngpham అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో ను షేర్ చేస్తూ తెలియజేశారు. అంతేకాక ఈ గులాబీ రంగు నీటి సరస్సు గుండా వేసిన రైలు పట్టాలపై రైలు వెళుతుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో ఈ సరస్సు పర్యాటకలను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ రమణీయమైన దృశ్యాన్ని చూసిన నేటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనకు తెలియని ఇలాంటి వింతలు విడ్డూరాలు ఇంకెన్ని ఉన్నాయో అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement