Raccoon Malware : రోబో 2.0 లాగా.. ఇప్పుడు కొత్త వైరస్ మార్కెట్ లోకి వచ్చేసింది. దాని పేరు రకూన్ మాల్ వేర్. ఇప్పటి వరకు ఉన్న వైరస్ లకు ఇది తాత అని చెప్పుకోవాలి. అదుకే దీన్ని మాల్ వేర్ 2.0 అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు సిస్టమ్స్ లో చొరబడి సమాచారాన్ని హ్యాక్ చేస్తున్న వైరస్ ల కంటే కూడా ఇది పవర్ ఫుల్.

ప్రపంచం మొత్తం ప్రస్తుతం డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని తమ పని కానిచ్చేందుకు హ్యాకర్లు కొత్త పంథాను వెతుక్కుంటున్నారు. అందుకే రోజురోజుకూ సైబర్ మోసాలు తెగ పెరిగిపోతున్నాయి. మాల్ వేర్స్ ను తయారు చేసి వదులుతున్నారు. ఎన్ని యాంటీ వైరస్ లు వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చే హ్యాకింగ్ వైరస్ లను ఏం చేయలేకపోతున్నాయి. దీంతో చాలామంది తమ సెన్సిటివ్ డేటాను కోల్పోతున్నారు.
Raccoon Malware : క్రిప్టో వాలెట్స్ ను కూడా క్రాక్ చేయగల మాల్ వేర్ ఇది
రకూన్ స్టెలార్ 2.0 పేరుతో సరికొత్త మాల్ వేర్ ను హ్యాకర్లు వదిలారు. ఇది నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, క్రిప్టో లావాదేవీలు, ఇతర లావాదేవీలు ఎక్కువగా చేసే యూజర్లనే టార్గెట్ చేసుకుంటుంది. ఈ మాల్ వేర్ నిజానికి.. గత సంవత్సరం వచ్చిందే. దాని ఆపరేషన్స్ ను హ్యాకర్లు ఇటీవలే ఆపేశారు. ప్రస్తుతం రకూన్ స్టెలార్ 2.0 పేరుతో సరికొత్త మాల్ వేర్ ను టార్గెట్ చేసిన యూజర్ల మీదికి వదిలారు.
ఈ మాల్ వేర్ ను సీ, సీప్లస్ ప్లస్ లాంగ్వేజ్ లలో డెవలప్ చేశారు. హ్యాకర్లు ఏం కంప్యూటర్ ను అయితే టార్గెట్ చేస్తారో.. ఆ కంప్యూటర్ లో ఉన్న ఏ ఒక్క సమాచారాన్ని ఈ మాల్ వేర్ వదలదు. క్షణాల్లో ఆ డేటాను మొత్తం హ్యాకర్లకు చేరవేస్తుంది. పాస్ వర్డ్ లతో పాటు కుకీలు, కంప్యూటర్ లో ఉండే ఫైల్స్, డ్రైవ్స్ లో ఉండే డేటా.. ప్రతి ఒక్కటి ఆ మాల్ వేర్ చేతికి చిక్కాల్సిందే అని సెక్యూరిటీ అనలిస్టులు చెబుతున్నారు.
అలాగే.. క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ను కూడా ఈ మాల్ వేర్ క్రాక్ చేయగలదు. ప్రస్తుతం చాలా క్రిప్టో వాలెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ రకూన్ హ్యాక్ చేయగలదట. అనంతరం.. వాలెట్ లో ఉన్న క్రిప్టో కరెన్సీని హ్యాకర్స్ కు ట్రాన్స్ ఫర్ చేసేస్తుందట. అందుకే ఈ తరహా వైరస్ తో అందరూ జాగ్రత్తగా ఉండాలని.. వైరస్ మన డివైజ్ లోకి చేరకుండా జాగ్రత్తగా ఉండాలని అనలిస్టులు సూచిస్తున్నారు.