Karthika Deepam Priyamani : కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి చాలా గుర్తింపు వచ్చింది. చిన్నపిల్లలు శౌర్య, హిమకు కూడా చాలా పాపులారిటీ వచ్చింది. మోనితగా నటించిన శోభా శెట్టికి కూడా ఈ సీరియల్ తోనే గుర్తింపు వచ్చింది. ఆనంద రావు, సౌందర్య, ఆదిత్య, శ్రావ్య.. ఇలా ఎవ్వరు అయినా సరే.. కేవలం కార్తీక దీపం సీరియల్ వల్లనే వాళ్లకు అంత పేరు వచ్చింది.

మీకు మోనిత ఇంట్లో పనిమనిషిగా చేసిన ప్రియమణి గుర్తుందా? మోనితకు మద్దతుగా ఉంటూ.. తను చెప్పినట్టు చేసి.. కార్తీక్, దీప ఇబ్బందులు పడేలా చేసింది గుర్తుందా? ఆ ప్రియమణే.. కార్తీక్, దీప చనిపోకముందే సీరియల్ నుంచి మాయం అయిపోయింది. తన ఊరికి వెళ్లిపోతున్నా అని చెప్పి ఏకంగా సీరియల్ నుంచే మాయం అయిపోయింది.
Karthika Deepam Priyamani : ప్రియమణి అసలు పేరు ఏంటో తెలుసా?
చాలామందికి తను ప్రియమణిగానే తెలుసు కానీ.. తన అసలు పేరు శ్రీదివ్య. తను సీరియల్ లో మోనిత కన్నా కూడా చాలా బాగా రెడీ అయ్యేది. దీంతో తనను అందరూ వావ్.. పనిమనుషులు ఇంత అందంగా కూడా ఉంటారా అని అందరూ ముక్కున వేలేసుకునేవారు.
అవును.. తను నిజంగానే అందంగా ఉంటుందని తన ఇన్ స్టా ఫోటోలు చూస్తేనే అర్థం అవుతోంది. అవును.. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలను చూస్తే మతిపోతుంది. బాబోయ్.. తను ఇంత అందంగా ఉంటుందా.. అంటూ షాక్ అవుతారు.
View this post on Instagram
ఇట్స్ శ్రీదివ్యాస్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది తనకు. ఆ అకౌంట్ లో తనకు 71 వేల ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు శ్రీదివ్య టచ్ లో ఉంటోంది. ప్రస్తుతం శ్రీదివ్య పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వామ్మో.. కార్తీక దీపం పనిమనిషి ఇంత అందంగా ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram