Cell Phone : ఇది స్మార్ట్ ఫోన్ యుగం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. అవి మన రోజు వారి జీవితంలో ఒకటయిపోయాయి. నిజానికి స్మార్ట్ ఫోన్లే కాదు.. ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, ఇతర చాలా గ్యాడ్జెట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి. చివరకు స్మార్ట్ వాచ్ కూడా చేతికి ఉండాల్సిందే. మార్కెట్ లో దొరికే ప్రతి గ్యాడ్జెట్ కు ఖచ్చితంగా చార్జింగ్ అవసరం. అయితే.. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే.. కొన్ని స్మార్ట్ ఫోన్లకు బీ టైప్ చార్జర్ ఉంటుంది. మరికొన్ని స్మార్ట్ ఫోన్లకు సీ టైప్ చార్జర్ ఉంటుంది.

ఇలా బీ టైప్, సీ టైప్ చార్జర్లతో చాలామంది చార్జింగ్ విషయంలో చిరాకు పడుతున్నారు. ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉంటే.. ఎన్ని గ్యాడ్జెట్స్ ఉంటే అన్నింటికీ సంబంధించిన చార్జర్లను పట్టుకెళ్లాల్సి వస్తోంది. ఇది అందరికీ ఉన్న సమస్యే. దీని నుంచి తప్పించుకోవడానికి మార్కెట్ లోకి వచ్చిందే ఒకే చార్జర్. ఎన్నిరకాల స్మార్ట్ డివైజ్ లు అయినా సరే.. ఒకే చార్జర్ ఉంటే ఎలా ఉంటుంది.. ఎక్కడికెళ్లినా ఒక చార్జర్ పట్టుకెళ్తే చాలు. అలా ఒకే చార్జర్ ను తయారు చేసేందుకు, అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట.
Cell Phone : అన్నింటికీ యూఎస్బీ సీ టైప్ చార్జింగ్ పోర్ట్
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, లాప్ ట్యాప్స్.. ఏవైనా సరే.. రాబోయే కొత్త మోడల్స్ అన్నింటికీ.. యూఎస్బీ టైప్ సీ చార్జర్ రానుంది. ఫీచర్ ఫోన్లకు తప్పించి.. మిగితా వాటికి అన్నింటికీ ఒకే రకమైన చార్జింగ్ పోర్ట్ ఉండనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే స్పందించి.. దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ కంపెనీలో టాస్క్ ఫోర్స్ చర్చింది.. రాబోయే అన్ని మోడల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు యూఎస్బీ సీ చార్జర్ ను పోర్టుగా ప్రవేశపెట్టాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక.. రాబోయే అన్ని మోడల్స్ కు ఒకే రకమైన యూఎస్బీ టైప్ సీ చార్జర్ రాబోతుందన్నమాట.