Kamal haasan : ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం కూడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ.. దేనితో పొత్తు పెట్టుకోవాలా అని తెగ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం అనే పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికలకు కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అధికార డీఎంకే పార్టీతో జతకట్టాలని ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఇప్పటికే కమల్ హాసన్.. వివిధ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలకు పలు సూచనలు చేశారట. నిజానికి.. గత ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. దాదాపు 85 జిల్లాల నేతలతో కమల్ హాసన్ భేటీ అయ్యారు.
Kamal haasan : కూటమి కోసం పట్టుబడుతున్న కమల్ హాసన్
లోక్ సభ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బలమైన కూటమితో ఎదుర్కోవాలని కమల్ హాసన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. డీఎంకేతో ఎలా జతకట్టాలి.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేదానిపై కమల్ హాసన్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే.. లోక్ సభ ఎన్నికలను ఎదుర్కునే విధంగా అందరూ సమాయత్తం కావాలి.. పొత్తుకు సంబంధించిన నిర్ణయం తాను తీసుకుంటానని.. ప్రజలతో నేతలు మమేకం కావాలని కమల్ హాసన్ నేతలకు సూచించారు.