ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోతారు.. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటూ ఉంటారు. అలాంటి అన్నాన్ని వండేటప్పుడు ఆడవారు బియ్యాన్ని కడిగి అన్నాన్ని వండుతుంటారు. అలా బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ ఒక్క చిన్న పని చేస్తే అపర కోటీశ్వరులు అయిపోతారని తంత్ర శాస్త్రం చెప్తుంది. ఆడవారు చేసే ప్రతి పనిలో కూడా ఒక విశిష్టత దాగి ఉంది. అన్నం వండేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించాలని అలాగే బియ్యాన్ని కరిగేటప్పుడు కూడాను కొన్ని పద్ధతులను పాటిస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖసంతోషాలతో తుల తుగుతుందని మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు వల్ల ఎంతో విశిష్టమైన లాభాలు చేకూర్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
మరి ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఏ పరిహారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.. ప్రతినిత్యం కూడా ఆడవారు అన్నం వండుతూ ఉంటారు. అలా అన్నం వండేటప్పుడు మనం తినే ఒక ముద్ద పక్కకి పెడుతూ ఉంటాము. అదేవిధంగా అన్నం తినేటప్పుడు ఒక ముద్దని పక్కకు పెట్టి దాన్ని కాకులకు లేకపోతే బయట ఏదైనా కుక్కలతో పెడుతుంటాము. ఇలా పెడితే ఎంతో పుణ్యఫలమని నమ్ముతూ ఉంటారు. చాలామంది కూడా ఇలా చేస్తూ ఉంటారు. కానీ బియ్యం కడిగేటప్పుడు మనం బియ్యాన్ని డబ్బాలో నుంచి పాత్రలోకి పోసేటప్పుడు ఒక గుప్పుడు బియ్యాన్ని వేరొక డబ్బాలో వేయండి.

అలా తీసిన బియ్యాన్ని ఏదైనా అంగవైకల్యం ఉన్న వ్యక్తులకి పేదవాళ్ళకి తిండి లేదని బాధపడే వారికి ఆ బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిసారి కూడా మీరు బియ్యం కడిగేటప్పుడు ఈ ఒక్క పని చేయండి చాలు మీకు న్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనంతో నిండి ఉంటుంది. ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఏ పరిహారం చేస్తే కోటీశ్వరులు అవుతారో తెలుసుకున్నారు కదా.. ఇక మీద నుంచి బియ్యం కడిగే ముందు ఈ విధంగా చేయండి చాలు కోటీశ్వరులు అవుతారు.