అమ్మ అంటే ఓ అనుబంధం, ఓ ఆప్యాయత. ఈ సృష్టిలో ప్రతి జీవికి అమ్మతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది. బిడ్డ విషయంలో తల్లి చూపించే ప్రేమ మాటల్లో చెప్పలేం. తన ప్రాణాలను ఫణంగా పెట్టిన బిడ్డను కాపాడుతుంది. అలాంటి తల్లి బిడ్డ చనిపోతే తట్టుకో కలుగుతుందా. అస్సలు తట్టుకోలేదు. అసలు విషయంలోకి వెళితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామంలో వీరమాచనేని శ్రీనివాసరావు, జగదీశ్వరి దంపతులకు 1997లో రంజిత్ అనే కుమారుడు పుట్టాడు. ఆ బాబుకి చిన్నతనం నుంచి కంట్లో రెటీనా సమస్య ఉంది. ఆ సమస్యతో బాధపడుతున్న కుమారుడికి సరైన వైద్యం అందించాలని హాస్పిటల్ లో చూపించారు.
కొన్ని నెలల తర్వాత రంజిత్ కు కంటి సమస్య నయం అయింది. అంతా బాగానే ఉంది కానీ రంజిత్ కు 25 సంవత్సరాలు వచ్చాక మళ్లీ సమస్య తిరగబెట్టింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు అలా కొద్ది రోజులు చికిత్స పొందుతున్న సమయంలో కంటి సమస్య చంపనుండి గుండెకు చేరడంతో కంటి సమస్య ఎక్కువైపోయింది. దీని కారణంగా రంజిత్ తల్లిదండ్రులు ముందే చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు దూరమయ్యాడని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంత అయ్యారు అలా కొన్ని నెలలు గడిచాయి. అయినా కొడుకు జ్ఞాపకాలు వారిని విడవలేదు. దీంతో అతని తల్లికి ఓ ఆలోచన వచ్చింది. ఆ విషయం తన భర్తకు చెప్పింది.
ఆయన దానికి ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరు ఆ పని చేయాలని డిసైడ్ అయ్యారు. వారు రాజస్థాన్లోని జైపూర్ లో కొడుకు విగ్రహాన్ని తయారు చేయించారు. దీనికోసం దాదాపుగా 3 లక్షల దాకా ఖర్చు పెట్టారు. తర్వాత పొలంలో గుడి కట్టి అందులో కొడుకు విగ్రహానికి ఏర్పాటు చేశారు. అంతేకాదు రంజిత్ ను ఇంటి ఇలవేల్పుగా భావించి అక్కడ ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. తమ కొడుకు మీద ఉన్న ప్రేమను ఆ తల్లిదండ్రులు అలా చాటుకున్నారు. ఈ వార్త చదివిన చాలామంది కొడుకు లేడని ఆ తల్లి ఎంత భాధ అనుభవిస్తుందో అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.