Nani : హిట్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్న నాని, మరో ఫుల్ లెంత్ కామెడీ తో మరో మూవీ రానుందా?

Nani : నేచురల్ స్టార్ నాని గురించి పెద్దగా ప్రేక్షకులకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. టక్ జగదీష్, శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి అనే మూడు సినిమాలతో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు మన నాచురల్ స్టార్. ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న నాని ఈ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. నాని కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ చాలా ఉన్నాయి అందులో బలే బలే మగాడివోయ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో నాని చేసిన మతిపరుపు క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

భలే భలే మగాడివోయ్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే సినిమాని పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో గోపీచంద్ రాశి ఖన్నా జంటగా నటించరు. అయితే తన తర్వాత ప్రాజెక్టు ఏంటి అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే విధంగా నాని తో చేసిన బలే బలే మగాడివోయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మళ్లీ నానితో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు వీరిద్దరి నెక్స్ట్ ప్రాజెక్టు ఉండబోతుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు ఎంత వరకు నిజం అవుతాయో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Nani : హిట్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్న నాని.

nani will give another chance to the hit director with another movie
nani will give another chance to the hit director with another movie

మారుతి నాని తమ తమ ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో తరువాతి ప్రాజెక్టును తెరకెక్కించడానికి వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే మారుతి ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని, ప్రభాస్తో సినిమా అధికారిక ప్రకటన ఇంకా రాకపోవడంతో మరి నానితో చేస్తాడా అనే అంశంలో సందిగ్ధత ఏర్పడింది. చూడాలి మరి నాని మారుతి వీరిద్దరు నెక్స్ట్ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో. ప్రేక్షకులు కోరుకునే విధంగా నాని మారుతి మరో ఫుల్ లెంత్ కామెడీ తో సినిమా చేయాలని మనందరం కోరుకుందాం.