5G : 5జీ అంటే ఐదో జనరేషన్. ప్రస్తుతం మనం ఇంకా 4జీలో ఉన్నాం అని అనుకుంటున్నాం కానీ.. మనం మనకు తెలియకుండానే ఫిఫ్త్ జనరేషన్ లోకి ఎంటర్ అయ్యాం. 2022 మార్చి వరకే ఇండియాలో 5జీ సబ్ స్క్రిప్షన్స్ 70 మిలియన్లు అయ్యాయి. అంటే 7 కోట్లు అన్నమాట. నిజానికి.. టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక భాగం. అది లేకుంటే ఇప్పుడు మన జీవితమే లేదు. ప్రస్తుతం ఏ పని చేయాలన్నా టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్నాం. రోజుకూ కొన్ని వందల వేల టెరా బైట్ల డేటాను వినియోగిస్తున్నాం. రేషన్ బియ్యం తీసుకోవాలన్నా.. టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్నాం. మనం చేసే ప్రతి పని టెక్నాలజీ మీద ఆధాపడి ఉన్నందున.. ఈ టెక్నాలజీని ఎంత వేగంగా పని చేసేలా చేయగలిగితే.. అంత తొందరగా పనులు అవుతాయి.

దీన్నే మనం డిజిటలైజేషన్ అని కూడా అంటాం. డిజిటలైజేషన్ వల్ల టెక్నాలజీని, ఇంటర్నెట్ ను ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్లలో అన్ని పనులు పూర్తవ్వాలంటే.. టెక్నాలజీలో ఎన్నో మార్పులు రావాలి. 3జీ, 4జీ కంటే వేగంగా పనిచేసే జనరేషన్ 5జీ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది.
5G : 2027 నాటికి ఇండియాలో 50 కోట్ల 5జీ సబ్ స్క్రిప్షన్లు
అవును.. 2027 లోపు ఇండియాలో 50 కోట్ల 5జీ సబ్ స్క్రిప్షన్లు ఉండనున్నాయట. అంటే మన దేశ జనాభాలో ఇంచుమించు సగం శాతం అన్నమాట. ప్రపంచంలోనే ఎక్కువ స్మార్ట్ ఫోన్ లను వినియోగించడం, ఎక్కువ ఇంటర్నెట్ డేటాను వినియోగించడంలో ఇండియా రెండో స్థానంలో ఉంది. 2021 లో సగటు భారతీయుడు నెలకు 20 జీబీ వాడేవారట. 2027 లోపు అది 50 జీబీ అవుతుందని ఎరిక్ సన్ కంపెనీ అంచనా వేసింది.
త్వరలోనే 5జీని లాంచ్ చేయడానికి మొబైల్ నెట్ వర్క్స్ సన్నాహాలు చేస్తున్నాయి. జులై 26 నుంచి సర్వీస్ ప్రొవైడర్స్.. తొలి 5జీ స్పెక్ట్రమ్ సేల్ ను లాంచ్ చేయనున్నారు. 5జీకి ఇండియన్స్ కూడా త్వరలోనే మారి.. ఇంటర్నెట్ సేవలను మరింత వేగంగా పొందగలుగుతారని ఎరిక్ సన్ తెలిపింది. అంటే.. ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో కూడా 5జీ విప్లవం రాబోతున్నదన్నమాట. 5జీ వస్తే.. ఇంటర్నెట్ సేవలు మరింత వేగం కానున్నాయి. ఏ పని అయినా ఇక నుంచి చిటికెలో కానుంది. దానికి కారణం.. 5జీ టెక్నాలజీ అంటే ఫాస్ట్ సర్వీస్ లే.