Health Tips : రేగి పండ్లు పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పండ్లు జనవరి నెలలో సమృద్ధిగా లభిస్తాయి. రేగి పండ్లు పల్లెల్లో నివసించే వారికి అందుబాటులో ఉంటాయి. పంట పొలాలలో ఎక్కడబడితే అక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. పట్టణాలలో కూడా వీటి వినియోగం జరుగుతుంది. ఈ పండ్లల్లో జింక్ ,విటమిన్ సి ,ఐరన్, ఫాస్ఫరస్ ,పొటాషియం ,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రేగి పండ్లు తినడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. రేకు చెట్టు ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకులను మందుల తయారీలో వినియోగిస్తున్నారు. మూత్ర సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలకు రేగి ఆకులు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఈ ఆకులను పేస్ట్ లేదా వాటర్ లో వేసి బాగా మరగబెట్టిన వచ్చిన కషాయం ను కూడా ఉపయోగించవచ్చు. ఈ ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips :మూత్ర మరియు గొంతు సంబంధిత వ్యాధులను రేగి ఆ కులతో నయం చేయవచ్చా.

యూనియన్ ఇన్ఫెక్షన్లు, యూరిన్లో మంట అనిపించడం, మూత్ర సంబంధిత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో జుజుబి ఆకుల రసాన్ని కలిపి తీసుకోవచ్చు. గొంతు నొప్పి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులతో కషాయాన్ని తయారుచేసి తీసుకోవాలి. రేగు ఆకులను తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి. దీనిని వాటర్ లో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకొని దానిలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడిని కలపాలి. ఈ కషాయాన్ని తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే చాలు. ఈ ఆకులను మెత్తగా దంచి… వాటర్ లో రాత్రంతా ఉంచాలి.
వీటిని ఉదయం లేచిన వెంటనే వడగట్టి ఖాళీ కడుపుతో తాగాలి. వీటిని క్రమం తప్పకుండా వారం రోజులు తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు కరిగి సన్నగా తయారవుతారు.అంతేకాకుండా కంటి కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను దూరం చేస్తుంది. ఈ నల్లటి వలయాన్ని దూరం చేసుకోవడానికి రేగి ఆకుల రసాన్ని కంటి బయట భాగంలో బాగా మర్దన చేయాలి. రేగాకుల రసం కంటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రేగి ఆకులు తగిలిన గాయాలను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ శరీరంలో ఏ భాగంలో అయినా గాయం అయితే… ఈ ఆకుల పేస్టుని గాయం ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.