Viral Video : గోల్డ్ చైన్ ను దొంగలించిన చీమలు.. వామ్మో.. ఇవి మామూలు చీమలు కాదు.. వీడియో వైరల్

Viral Video : ఎట్టెట్టా.. చీమలు ఏంటి.. గోల్డ్ చైన్ ను దొంగలించడం ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారా? అది అక్షరాలా నిజం. మీకు నమ్మకం కలగకపోతే.. వీడియోను కూడా చూపిస్తాం. అప్పుడు మీరు ఖచ్చితంగా నమ్ముతారు. చీమలే కదా.. అని చీప్ గా చూస్తున్నారేమో.. మా సత్తా ఏంటో చూడండి అన్నట్టుగా ఆ చీమలు ఏకంగా బంగారంతో చేసిన చైన్ నే కొట్టేశాయి.

ants steal gold chain video viral
ants steal gold chain video viral

ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్పడానికి ఈ వీడియో మంచి ఉదాహరణ. సాధారణంగా బెల్లం, చెక్కర ఎక్కడుంటే చీమలు అక్కడుంటాయి. కానీ.. ఇవి మాత్రం మామూలు చీమలు కాదు.. ఏకంగా బంగారం చైన్ కే ఎసరు పెట్టాయి. అసలు ఇలాంటి చీమలను మీరు ఎక్కడా చూసి ఉండరు.

Viral Video : చీమలను చూసి మనం చాలా నేర్చుకోవాలి

నిజానికి.. చీమలను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి. చీమలు.. తమ శక్తికి మించిన పని చేస్తాయి. అందులోనూ అవి కలిసికట్టుగా ఉంటాయి. అందుకే.. ఒక్కరు కాకుండా.. అందరూ తలో చేయి వేస్తే ఏ పని అయినా ఈజీగా చేసేయొచ్చు అని నిరూపించాయి ఈ చీమలు. కలిసికట్టుగా పనిచేస్తే ఏ పని అయినా చిటికెలో చేయొచ్చని నిరూపించాయి.

చీమలు బంగారపు చైన్ ను ఎత్తుకెళ్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఐపీసీలోని ఏ సెక్షన్ మీద వీటిని ఇప్పుడు అరెస్ట్ చేయాలి.. అంటూ ఆయన క్యాప్సన్ పెట్టాడు. ఇక.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో.. వేటినీ తక్కువ అంచనా వేయొద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.