Anu Emmanueal and Allu Sirish : అను ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది కానీ.. తనకు తెలుగు ఇండస్ట్రీలో సరైన సక్సెస్ మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ తోనూ నటించింది కానీ.. ఆ సినిమా ప్లాఫ్ అయింది. శైలజారెడ్డి అల్లుడు, ఆక్సిజన్, నా పేరు సూర్య, మహా సముద్రం, అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా తనకు సక్సెస్ ను తీసుకురాలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా అను పేరు తెచ్చుకుంది కానీ.. ఇప్పటి వరకు తను నటించిన ఏ సినిమా సూపర్ డూపర్ హిట్ కాలేదు.

అయితే.. అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా వస్తున్న ప్రేమ కాదంట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా లివిన్ రిలేషన్ షిప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర సినిమాలో కూడా అను హీరోయిన్ గా నటిస్తోంది.
Anu Emmanueal and Allu Sirish :అందాలు ఆరబోస్తున్నా ఆఫర్లు రావడం లేదా?
ఈ మధ్య అను ఇమ్మాన్యుయేల్ తన అందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తోంది. తనకు ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో ఇక.. గ్లామర్ కు ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తనకు.. అల్లు శిరీష్ కు మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని.. తను అల్లు ఫ్యామిలీలోకి తను కోడలుగా వెళ్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
అల్లు శిరీష్, అను మధ్య ఏదో ఉందని పుకార్లు వస్తున్నప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి.. వాళ్లు ఇద్దరూ కలిసి ప్రేమ కాదంట అనే సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. వాళ్ల ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే.. తన కెరీర్ ప్రేమ కాదంట, రావణాసుర సినిమాలతోనైనా గాడిన పడుతుందేమోనని అను తెగ ఎదురుచూస్తుందట. కానీ.. ప్రేమ కాదంట సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి అప్ డేట్ లేదు. రావణాసుర సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. చూద్దాం మరి.. అను ఇమ్మాన్యుయేల్ లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో?