Viral Video : దేన్ని చూసినా భయపడని వాళ్లు చాలామంది పాములను చూసి భయపడుతుంటారు. పాములంటే అంత భయం మరి. చిన్న పిల్లలే కాదు.. పెద్దలు కూడా పాములను చూసి భయపడుతుంటారు. ముఖ్యంగా నాగుపాములు అయితే వాటిని చూడగానే కింద లాగు తడిసిపోవాల్సిందే. అవి అంత డేంజర్ మరి. అన్ని పాముల్లోనూ నాగుపాములంటే హడలే. కోబ్రాలు పగడ విప్పాయంటే ఇక అంతే. అందుకే పాములు తిరిగే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు ఉన్న చోటుకు వెళ్లి పాములను చూసి హడలిపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. పాములు ఎక్కువగా చెట్లు ఉన్న ప్రాంతాల్లో, అడవుల్లో ఉంటాయి. కాకపోతే నీళ్ల కోసమో.. లేక ఆహారం కోసం ఒక్కోసారి బయటికి వస్తాయి. రోడ్ల మీద కూడా అప్పుడప్పుడు పాములు కనిపిస్తుంటాయి. చివరకు గ్రామాల్లోకి కూడా వస్తుంటాయి. ఒక్కోసారి డైరెక్ట్ గా ఇంట్లోకే వస్తాయి.

అడవుల్లో ఉన్న చెట్లను మనుషులు నరికేస్తే.. వాటి స్థావరాలను ధ్వంసం చేస్తే పాములు ఏకంగా మనుషులు ఉండే చోటుకు వస్తాయి. ఒక్కోసారి ఇళ్లలోకి కూడా దూరుతాయి. అప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఇళ్లలోకి దూరినప్పుడు ఇంట్లో ఉండేవాళ్లు వాటిని చూడకుండా తొక్కడమే.. వాటిని తాకడమో చేస్తే ఇక అంతే సంగతులు. మళ్లీ మంచినీళ్లు కూడా అడగరు. అవి కాటేస్తే 10 నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది.
Viral Video : మనుషులు కనిపిస్తే దూరం వెళ్లిపోయే స్వభావం పాములది
పాములు నిజానికి మనుషులు ఎవ్వరు కనిపించినా చాలు.. దూరం వెళ్లిపోతాయి. మనుషులు తమ పక్క నుంచి వెళ్లినా కూడా అవి ఏం చేయవు. ఒకవేళ ఎవరైనా తమకు హాని తలపెడతారని భావిస్తేనే దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అంతే తప్ప.. స్వతహాగా పాములు ఏనాడు కూడా మనిషిని చంపాలని.. కాటేయాలని ప్రయత్నించవు. మనకు పాము అంటే ఎంత భయమూ.. వాటికి కూడా మనుషులంటే అంత భయం. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ఓ ఇంట్లోకి పెద్ద నాగుపాము దూరింది. దాన్ని చూసిన ఇంటి వాళ్లు పరుగు లంఖించుకున్నారు. వెంటనే రెస్క్యూ టీమ్ కు ఫోన్ చేశారు. అప్పటికే అర్థరాత్రి అయినా సరే.. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకొని ఆ పామును బంధించింది. అది చాలా అరుదైన నాగుపాము అని వీడియోలో ఆ వ్యక్తి చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. ఇంత పెద్ద పెద్ద పాములు ఇళ్లలోకి జొరబడితే మనుషుల ప్రాణాలు ఏం కాను.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.