Viral Video : ఈ జనరేషన్ వేరు.. ఇదివరకు జనరేషన్ వేరు. ఇదివరకు పెళ్లి అంటే చాలు.. పెళ్లి కూతురు దించిన తలను ఎత్తేది కాదు. పెళ్లిచూపుల సమయం నుంచి పెళ్లి అవడంతో పాటు శోభనం వరకు కూడా పెళ్లికూతురు సిగ్గుపడుతూనే ఉంటుంది. తన భర్తతో మాట్లాడటానికి కూడా సిగ్గుపడేది ఒకప్పటి పెళ్లికూతురు. కానీ ఈ జనరేషన్ పెళ్లికూతుళ్లు మాత్రం చాలా మారిపోయారు. ఈ జనరేషన్ వాళ్ల లెక్కలే వేరు. సోషల్ మీడియాను ఫాలో అయ్యే నేటి యువతులు.. పెళ్లిలో చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఇటీవల బుల్లెట్ బండెక్కి అనే పాటకు ఓ పెళ్లికూతురు పెళ్లి భారత్ లో చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత అదే లెగసీ ఫాలో అవుతోంది. ఎవరి పెళ్లిలో ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది. కొందరు పెళ్లికూతుళ్లు అయితే ఏకంగా పెళ్లి మండపం మీదనే డ్యాన్స్ వేసి అదరగొట్టేస్తున్నారు.
Viral Video : పెళ్లి ఊరేగింపులో రచ్చ చేసిన పెళ్లికూతురు వీడియో వైరల్
తాజాగా ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. తాను పెళ్లి కూతురును అని కూడా మరిచిపోయినట్టుంది ఆ యువతి. రచ్చ రచ్చ చేసింది. తన డ్యాన్స్ తో అదరగొట్టేసింది. దీంతో పెళ్లి ఊరేగింపులో పెళ్లికి వచ్చిన అతిథులతో పాటు పెళ్లికొడుకు కూడా తన డ్యాన్స్ ను చూసి షాక్ అయ్యారు.
చివరకు పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతురుతో పాటు డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కూతురు చేసే డ్యాన్స్ చూసి పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఆగలేకపోయారు. తనతో పాటు డ్యాన్స్ చేశారు. మొత్తానికి పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. వామ్మో.. యువతి మామూలుగా డ్యాన్స్ వేయట్లేదుగా అని నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.