Viral Video : ఈరోజుల్లో పెళ్లి కంటే ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయడం సహజమే. చాలామంది పెళ్లి కంటే ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లు చేస్తుంటారు. తెగ హడావుడి చేస్తుంటారు. ఒకప్పుడు పెళ్లి అంటే ఇవన్నీ ఎక్కడివి. ఫోటోషూట్ లేదు.. గీటోషూట్ లేదు. కనీసం పెళ్లిళ్లలో ఫోటోలు కూడా లేవు. కానీ.. ఇప్పుడు పెళ్లి కుదరడం దగ్గర్నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు రకరకాలుగా షూట్స్ చేస్తున్నారు.
అయితే.. ఇంకొందరు అయితే చాలా వినూత్నంగా ఫోటోషూట్స్ చేస్తున్నారు. అదే కదా స్పెషాలిటీ. అందమైన లోకేషన్లలో ఎవరైనా ఫోటోషూట్ చేస్తారు. కానీ.. ఈ యువతి మాత్రం తన పెళ్లిని ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది. ఇదే కదా వెరైటీగా ఆలోచించడం అంటే. ఆ యువతి చేసిన ఆలోచనను ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మెచ్చుకుంటోంది.
Viral Video : పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై గుంతల రోడ్డు మీద ఫోటోషూట్
ఓ పెళ్లి కూతురు తన తన వివాహ వేడుక కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా వెరైటీ నిర్ణయం తీసుకుంది. పెళ్లి కూతురులా ముస్తాబైన ఆ యువతి డైరెక్ట్ గా గుంతల రోడ్డు దగ్గరికి వెళ్లి మురికి నీళ్లు ఉన్న గుంతల రోడ్డు దగ్గర ఫోటోషూట్ చేసింది. ఇదొక సామాజిక బాధ్యతగా తను వ్యవహరించింది. బంగారు ఆభరణాలు ధరించి పెళ్లికూతురులా రెడీ అయి వర్షం నీళ్లలో నడుస్తూ ఫోటోలు దిగింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం ఈ వీడియో చూసి అయినా ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, తనవంతు సామాజిక బాధ్యతను నెరవేర్చానని ఆ యువతి ఆ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.