Kiwi Side Effects : ఈ కివీ పండ్లను ఎక్కువగా రక్త కణాలు పడిపోయినప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు దీనిని ఎక్కువగా తీసుకుంటారు. వైరల్ జ్వరాలలో ఈ రక్త కణాలు పడిపోయినప్పుడు ఈ కివి పండుని తినమని ఎక్కువగా వైద్య నిపుణులు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈకివీలో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, ఆంటీ ఇన్ప్ల ప్లమెంటరీ, యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉంటాయి.
అలాగే పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్ b6 బీటాకేరేటిన్ మొదలైన ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఈ కివి తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యల నుండి రక్షిస్తుంది. అయితే కివిని ఎక్కువగా తినడం వలన ఆరోగ్యానికి హాని కూడా చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ హానికరమైన సమస్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…
Kiwi Side Effects : అయితే తప్పకుండా ఈ విషయలను తెలుసుకోవాలి…
కివి అధికంగా తీసుకోవడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి…
కిడ్నీల సమస్యలు: మూత్రపిండాల వాదిగ్రస్తులు కివిని తీసుకోవడం, అస్సలు మంచిది కాదు నిజానికి కివిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. కావున ఈ సమస్య ఉన్నవాళ్లు కివిని ఎక్కువగా తీసుకోవద్దు..
అతిసార ఇబ్బంది: ఈకివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వలన డయేరియా ఇబ్బందులు ఉండవచ్చు.. అలాగే చాలామందికి వాంతులు, వికారం కడుపునొప్పి లాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి.
అలర్జీ తో బాధపడేవారు: కివిని అధికంగా తీసుకోవడం వలన అలర్జీ లాంటి ఇబ్బందులు వస్తాయి. ప్రధానంగా దీనివలన శరీరంపై వాపులు, దద్దుర్లు నోటి లోపల పుండ్లు అస్తమ లాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.
నోటి అలర్జీ సిండ్రమ్స్: కివిని అధికంగా తినడం వలన నోటి అలర్జీ సిండ్రమ్స్ రావచ్చు. దీనివలన నాలుక, పెదవులు వాపు నోటిలోపల పండ్లు వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని కలవాలి