Viral Video : అది చిరుత అంటే.. జింకను ఎలా వేటాడిందో చూడండి.. తెలివితో జింక ఏం చేసిందంటే?

Viral Video : జింక పేరు ఎత్తగానే.. మనకు గుర్తొచ్చే మరో పేరు పులి లేదా సింహం. ఎందుకంటే జింకలను ఎక్కువగా వేటాడేది ఇవే. అడవికి రాజు అయిన పులి, సింహం.. జింకను వేటాడి వాటి రక్తం తాగి దాని మాంసాన్ని అక్కడే వదిలేస్తాయి. ఆ మాంసాన్ని తిని మిగితా జీవులు మనుగడ సాధిస్తాయి. అయితే అడవిలోని జంతువుల వేట అనేది ఒక సైకిల్ లా ఉంటుంది. పులులు వేరే జంతువులను వేటాడటం, వేరే జంతువులు వాటికన్నా చిన్న జంతువులను.. అలా ఒక జంతువు మరో జంతువును చంపి తిని బతుకు పోరాటంలో జీవనం సాగిస్తుంటాయి.

Advertisement
cheetah hunting deer video viral
cheetah hunting deer video viral

అయితే.. ఏ వేట అంతగా మజాగా అనిపించదు కానీ.. ఒక్క వేట మాత్రం పిచ్చెక్కిస్తుంది. అదిరిపోతుంది. అదే పులి, జింక వేట. మామూలు పులి కన్నా.. చిరుత పులి, జింక వేట అయితే.. ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. పులి, జింక వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలను ఇప్పటి వరకు చూసి ఉంటారు. కానీ.. ఈరకమైన వేటాడటాన్ని మాత్రం మీరు చూసి ఉండరు.

Advertisement

Viral Video : పులి, జింక వేటకు సంబంధించిన వీడియో వైరల్

తాజాగా చిరుత పులి జింకను వేటాడే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. ఒక జింకను పులి ఇలా వేటాడుతుందా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. పులి వెంటపడే కొద్దీ జింక తన స్పీడ్ పెంచి మరీ పరుగెడుతుంది. ఎప్పుడైతే తన స్పీడ్ తగ్గుతుందో ఇక అంతే. జింక..పులికి ఆహారం అయినట్టే లెక్క. పులి నుంచి తప్పించుకునే చాన్సే ఉండదు. పులి ఏకంగా మెడనే పట్టేసి రక్తాన్ని పీల్చేస్తుంది. దీంతో గిలగిలా కొట్టుకొని జింక చావాల్సిందే. అయితే.. ఈ వీడియోలో పులి ఎంతో ఒడుపుతో జింకను పట్టుకున్నప్పటికీ.. కొన్ని సార్లు జింకలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాయి. రివర్స్ లో పులులతోనే ఫైట్ కు రెడీ అవుతాయి. తమ కొమ్ములతో వాటితో దాడి చేస్తాయి. కానీ.. ఈ జింక మాత్రం దాడి అయితే చేసింది కానీ.. చివరకు అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఎవరి బతుకు అయినా అంతే చివరికి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement