Viral Video : ఏ సిటీ అయినా సరే.. ట్రాఫిక్ అనేది కామన్. అది ఢిల్లీ అయినా ముంబై అయినా.. చెన్నై అయినా.. హైదరాబాద్ అయినా.. బెంగళూరు అయినా.. కోల్ కతా అయిన.. ట్రాఫిక్ మాత్రం కామన్ కదా. ఉదయం 8 అయిందంటే చాలు.. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల దగ్గర్నుంచి పనులు చేసుకునే వాళ్లు, వ్యాపారస్థులు, స్కూల్ కు వెళ్లే విద్యార్థుల వరకు అందరూ రోడ్ల మీదికి వచ్చేస్తారు. దీంతో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సిందే. ఆ ట్రాఫిక్ కు కాస్త వర్షం తోడు అయితే ఇంకేమైనా ఉందా.. ఇక రోడ్డు మీదనే సాయంత్రం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఒకవేళ అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే… ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే.. అటువంటి వాళ్లు ఏం చేయాలి. అటువంటి పరిస్థితే ఓ డాక్టర్ కు వస్తే ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లెబడతారు. ఈ ఘటన మరెక్కడో కాదు.. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో చోటు చేసుకుంది. ఉదయమే హాస్పిటల్ లో పేషెంట్ కు సర్జరీ చేయాలి. కానీ.. డాక్టర్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాడు. గంటలు అవుతున్నా ట్రాఫిక్ మాత్రం కదలడం లేదు. దీంతో ఆ డాక్టర్ కు ఏం చేయాలో తెలియలేదు.
Viral Video : మూడు కిమీలు పరిగెత్తి సర్జరీ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్
మణిపాల్ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్ గా డాక్టర్ గోవింద్ కుమార్ పనిచేస్తున్నాడు. ఉదయమే ఓ మహిళకు గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలి. ఉదయమే ఇంటి నుంచి బయలుదేరినా.. అనుకున్న సమయానికి ఆసుపత్రికి చేరుకోలేకపోయాడు. దానికి కారణం.. ట్రాఫిక్ జామ్. దీంతో ఏం చేయాలో తెలియక కారు దిగి పరుగు ప్రారంభించాడు. దాదాపు మూడు కిలోమీటర్లు పరిగెత్తి ఆసుపత్రికి చేరుకొని ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి ఆ మహిళ ప్రాణాలు కాపాడాడు డాక్టర్. ఆయన రోడ్డు మీద పరుగెడుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ డాక్టర్ కు సలామ్ కొడుతున్నారు. పేషెంట్ ను బతికించడం కోసమే కన్నింగ్ హామ్ రోడ్డు నుంచి సర్జాపూర్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్లానని.. కారును డ్రైవర్ కు వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లడం వల్లే సమయానికి ఆసుపత్రికి చేరుకొని సర్జరీ చేయగలిగానని డాక్టర్ గోవింద్ కుమార్ తెలిపారు.
.@SoumiEmd @CCellini @andersoncooper @WCMSurgery @nycHealthy @NYCRUNS https://t.co/54zt4H5SxY #runtowork @ManipalHealth #togetherstronger pic.twitter.com/21NYbZgraX
— Govind Nandakumar MD (@docgovind) September 12, 2022