Kajal Agarwal : టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ బామ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది. తనలో ఉన్న టాలెంట్ ని లక్ష్మీ కల్యాణం అనే సినిమా తోనే బయటపెట్టి.. బిగ్ స్టార్స్ దృష్టిలో పడింది. ఇక తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రెండో సినిమాకి ఛాన్స్ కొట్టేసి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అయిపోయింది. అన్ని భాషల్లో టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్ సినిమాలు చేస్తూ పెద్ద నటిగా నిలిచిపోయింది.
ఈ భామ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని పెళ్లి చేసుకొని… ఒక బాబుకు జన్మనిచ్చి ఆ బాబుతో ఎంజాయ్ చేస్తుంది. భారతీయుడు రెండవ సినిమాలో హీరోయిన్ గా నటించిందని ప్రచారాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ బిగ్ డైరెక్టర్ రీసెంట్గా కాజల్ అగర్వాల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారట. మీకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాను అని అన్నారట. మీరు బాబుకి జన్మనిచ్చిన తర్వాత మీ ముఖం బాగా లావు అయిపోయింది. బుగ్గలు లావుగా అయిపోయాయి. కొంచెం వాటిని తగ్గించుకుంటే… మళ్లీ మీరు హీరోయిన్ గా నటించవచ్చు అని అన్నారు..
Kajal Agarwal : అది తగ్గించుకో అంటున్న బిగ్ డైరెక్టర్…

లేకపోతే నీవు ఆంటీ లా కనిపిస్తావు.. అంటూ కాజల్ అగర్వాల్ ని పరోక్షంగా కామెంట్స్ చేశారంట. దీంతో ఆమెకి ఇది ఘోర అవమానం అంటూ అంటున్నారు కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్. ఏ స్త్రీ కైనా సరే ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. అది తెలియకుండా ఈ స్టార్ డైరెక్టర్ కాజల్ ని అంత మాట ఎలా అనగలడు అంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఆ డైరెక్టర్ ఇచ్చిన ఆఫర్ ని కాజల్ రిజెక్ట్ చేయడమే చాలా ఉత్తమం అంటూ సలహాలు ఇస్తున్నారు. కానీ కాజల్ మాత్రం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.