Viral Video : కుక్కతో క్రూరంగా ప్రవర్తించాడు.. తాడుతో కారుకు కట్టేసి ఈడ్చుకెళ్లాడు

Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటాయి. మరికొన్ని మోటివేషనల్ వీడియోలు ఉంటాయి. ఇంకొన్ని బాధాకరమైన వీడియోలు కూడా ఉంటాయి. ఎన్నో వీడియోలు ప్రతి రోజు సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతున్నా కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. అందులో ఈ వీడియో ఒకటి. నిజానికి.. ఎక్కడ ఏం జరిగినా.. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జనాలు. దీంతో ఆ వీడియోలను ప్రపంచం మొత్తం చూస్తోంది. ఎక్కడో ఏదో మూలన జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తోందంటే దానికి కారణం సోషల్ మీడియా.

Advertisement
dog dragged after tied to car video viral
dog dragged after tied to car video viral

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుక్కను కారుకు తాడుతో కట్టేసి ఓ వ్యక్తి దాన్ని ఈడ్చుకెళ్తున్నాడు. రోడ్డు మీద కారుతో సమానంగా పరిగెత్తలేక అవస్థలు పడుతోంది. ఈ ఘటనను చూసి వెనుకే బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. వెంటనే కారుకు అడ్డంగా బైక్ ను పోనిచ్చి కారును ఆపి ఎందుకు అలా కుక్కను కట్టేసి కారుతో ఈడ్చుకెళ్తున్నారు అంటూ ప్రశ్నించాడు.

Advertisement

Viral Video : తన ఇంటి దగ్గర తిరుగుతున్న వీధి కుక్కను వేరే చోట వదిలిపెట్టేందుకు డాక్టర్ యత్నం

కుక్కను కారుకు కట్టేసి ఈడ్చుకెళ్లిన ఆ వ్యక్తి ఒక డాక్టర్. అతడి పేరు రాజ్ నీష్ గ్వాలా. తన ఇంటి దగ్గర ఈ వీధి కుక్క తిరుగుతోందని దాన్ని వేరే చోట వదిలేసేందుకు ఇలా తన కారుకు కట్టేసి రోడ్డు మీద కారుతో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన పలు ఎన్జీవో సంస్థలు అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అతడి డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని కోరుతున్నాయి. యానిమల్ క్రూయెల్టీ యాక్ట్ కింది అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మొత్తానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏమాత్రం కనికరం లేకుండా ఆ కుక్కను అలా ఎలా ఈడ్చుకెళ్లాలనిపించింది అంటూ ఆ డాక్టర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలా కారుతో ఈడ్చుకెళ్లడం వల్ల ఆ కుక్క కాళ్లకు గాయాలవడంతో దాన్ని వెంటనే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

Advertisement