Rashmi Goutham : తెలుగు బుల్లితెరపై రష్మీ అంటే తెలియని ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఆ విధంగా రష్మీ తెలుగులో తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోయింది. జబర్దస్త్ యాంకర్ గా తెలుగు బుల్లితెరపై కనిపించిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ ను సంపాదించుకుంది. రష్మీ గౌతమ్ కు ఉన్న మరో మంచి అలవాటు జంతువులను అమితంగా ప్రేమిస్తుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తుల కామెంట్లు హద్దు మీరుతున్నాయి. స్టార్ యాంకర్లను మరియు సెలబ్రిటీలను అడిగే ప్రశ్నలకు వారి ఇమేజ్ కు భంగం కలిగించేలా ఉంటున్నాయి. అటువంటి వారు అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేని సందిగ్ధంలో పడేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితి చాలా మంది సెలబ్రిటీలకు హీరోయిన్లకు ఇంకా యాంకర్లకి చాలాసార్లు వచ్చింది. లేటెస్ట్ గా జబర్దస్త్ లో బ్యూటిఫుల్ యాంకర్ అయినటువంటి రష్మీకి ఎటువంటి పరిస్థితి ఎదురయింది. అయితే రేష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతూ వస్తుంది. అంతేకాకుండా తన అభిమానులతో చాలా సరదాగా ఉంటుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తనతో చాట్ చేస్తున్నావు అన్నిటికి అడిగిన ప్రశ్న ఆమెను ఇబ్బంది పెట్టేదిగా ఉన్నప్పటికీ. ఆమె ఇచ్చిన సమాధానం కి ఆ వ్యక్తికి దిమ్మతిరిగిపోయిందంటూ ఆమె అభిమానులు కామెంట్ చేయడం జరిగింది.
Rashmi Goutham : నేను రెడీ.. నువ్వు రెడీనా…

అయితే ఆ సోషల్ మీడియా లో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే రష్మీ గారు మీరు ఎందుకు చెత్త ప్రోగ్రాం చేస్తున్నారని హీరోయిన్ గా మీరు ప్రయత్నించండి మీరు చాలా అందంగా ఉంటారు అంటూ అడిగిన ప్రశ్నకు సమానంగా రేష్మి ఈ విధంగా రిప్లై ఇవ్వడం జరిగింది. నా దగ్గర చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. నేను హీరోయిన్ గా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు డైరెక్షన్ చేయగలుగుతారా అంటూ మీరు డైరెక్షన్ చేయగలిగితే ఇప్పుడే యాంకరింగ్ వదిలేస్తానంటూ ఆ నేటిజన్ కు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. అమ్మడు చేసిన ఈ పనికి తన అభిమానులు పొగుడుతూ మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చావు అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి మీరు ఇలానే సమాధానం చెప్పాలి అంటూ మీరు చేసిన పని సూపర్ అంటూ రష్మిని పొగడ్తలతో చేస్తున్నారు.