Viral Video : ఏనుగులు ఎంత బలమైనవో అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద వాహనాలను కూడా అవి తమ తొండాలతో అమాంతం ఎత్తగలవు. అడవుల్లో ఉండే జంతువుల్లో అత్యంత బలమైనవి ఏనుగులే. వాటి తర్వాతే ఏవైనా. అందుకే.. ఏనుగుల జోలికి ఏ జంతువు పోదు. చివరకు మనుషులు కూడా ఏనుగుల జోలికి పోరు. అవి ఒక తొక్కు తొక్కాయంటే ఇక అంతే. కానీ.. ఏనుగులకు కోపం వస్తేనే అవి ఎవరి జోలికి అయినా పోతాయి. లేకపోతే వాటి పని అవి చేసుకుంటాయి.
అయితే.. వాటికి ఏదైనా గాయం అయినా.. వాటికి చేతగాక కింద పడిపోయినా వాటిని లేపాలంటే ఎవరి తరం కాదు. రెస్క్యూ టీమ్ అయితే వాటిని లేపడానికి పెద్ద పెద్ద క్రేన్స్ ను తీసుకురావాల్సి వస్తుంది. అడవుల్లో వెళ్తూ బావుల్లో, సరస్సులలో పడిపోయిన ఏనుగులను చాలాసార్లు రక్షించిన వీడియోలను చూశాం. తాజాగా రెండు ఆడ ఏనుగులు సరస్సులోని బురదలో చిక్కుకుపోయాయి. వాటిని రక్షించడం కోసం రెస్క్యూ టీమ్ చాలా కష్టపడింది.
Viral Video : కెన్యాలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఆఫ్రికాలోని కెన్యాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బురద గుంటలో చిక్కుకున్న ఆ ఏనుగులు రెండు రోజుల నుంచి అలాగే ఉండిపోయాయి. వాటిని గమనించిన స్థానికులు రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన ఆ ఏనుగులను కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే రెస్క్యూ టీమ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ ఏనుగులను బయటికి లాగడానికి రెస్క్యూ టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్లు కూడా బురదలోకి దిగి ఆ ఏనుగులకు పెద్ద పెద్ద తాడులు కట్టి వాహనాలతో బయటికి లాగాల్సి వచ్చింది. మొత్తానికి వాళ్ల కష్టానికి తగ్గ ఫలితం లభించడంతో అందరూ ఖుషీ అయ్యారు.
View this post on Instagram