Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన హీరోయిన్. ప్రేమమ్ సినిమాతో మలయాళం ఇంకా తెలుగులో అఅరించిన అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్లో వచ్చిన అ ఆ సినిమాతో విలక్షణమైన పాత్రలో తర్వాత నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ఈ అమ్మడు. బాక్సాఫీస్ వద్ద భారీ హీటర్ అందుకోవడంతో తెలుగులో అవకాశాలు త్వరగా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేగాక శర్వనంద్ తో వచ్చిన శతమానం భవతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయింది.
ఈ రెండు సినిమాల తర్వాత అనుపమ పరమేశ్వరన్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో ఇంకా తమిళ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఎన్ని అవకాశాలు వచ్చినా గాని రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇష్టపడలేదు ఈ సొట్టబుగ్గల భామ. తన పరిధి దాటకుండా సినిమాలు చేసుకుంటూ తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇటీవల రౌడీ బాయ్స్ అనే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఎవరు ఊహించని విధంగా ఓ రొమాంటిక్ సీన్ లో లిప్ లోక్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో అమ్మడు ను ఈ విధంగా చూసిన తెలుగు ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
Anupama Parameswaran : 54 ఏళ్ల హీరో తో రొమాంటిక్ మూవీలో…
అయితే అనుపమ పాత్ర నచ్చితే అంతే కాకుండా సినిమాకు అవసరమైతే తను ఎలాంటి సన్నివేశాలలో సిద్ధంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు వయసులో పెద్దవాడైనటువంటి సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందట. అతను ఏవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ అని సినీ వర్గాల సమాచారం. రవితేజ వయసు ఇప్పటికే 54 అయినప్పటికీ పాతికేళ్ళ హీరోలా కనిపిస్తూ ఉంటాడు అయితే అనుపమ పరమేశ్వరన్ తో చేయబోయే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయని తెలుస్తుంది. సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.