Dharma Sandehalu : దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని చీమలు పట్టడం లేదా చీమలు ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా చీమలు నైవేద్యాన్ని తినడం వలన ఇంట్లో ఏదైనా జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే అసలు ఇంట్లో చీమలు కనిపించడం ఎంతో అదృష్టం అని, ఇంట్లో ఉన్నఫలంగా నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధన లాభం కలగబోతుందని, లక్ష్మీ కటాక్షం కలగబోతుందని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఎర్ర చీమలు చెడుకు శకుని అని చెబుతూ ఉంటారు. ఇంట్లో కనుక ఎర్ర చీమలు ఉన్నఫలంగా కనిపిస్తే అది జరగబోయే చెడుకు సంకేతం అని చెబుతూ ఉంటారు. ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపించే చీమలు కనుక మీ ఇంట్లో ఉంటే అదృష్టం పట్టబోతుందని అర్థం. సాధారణంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అందరూ తీసుకుంటారు.
మిగిలిన ప్రసాదానికి లేదా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి. అయితే ఇలా పడితే ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అని అర్థం. ఎవరైతే ఆర్థికంగా డబ్బులు లేకుండా అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతుంటారో వారు ఆ కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది అని అర్థం. జీతం సరిపోకపోయినా మెరుగైన జీతం కోసం ఎదురుచూస్తున్నా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, ఆర్థిక కష్టాల నుంచి బయట పడాలన్నా, అనారోగ్య సమస్యలను నుంచి విముక్తి పొందాలన్న నైవేద్యాన్ని సమర్పించినప్పుడు భగవంతుడిని మనసులో కోరుకోవాలి. ఏ కోరిక అయితే నెరవేరాలి అని మహాలక్ష్మిని ప్రార్థిస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.
చీమల రూపంలో ప్రకృతి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు అని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి నైవేద్యానికి చీమలు పడితే భయపడాల్సిన సందేహం లేదు. లక్ష్మీదేవి రాకకు కష్టాలన్నీ తొలగిస్తున్నాయని చెప్పడానికి సంకేతం. ఇకపోతే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు పూజారి ప్రసాదం పెడితే అలాగే నోట్లో వేసుకుంటారు. అయితే అలా ఎప్పుడూ చేయకూడదు. పక్షులకు చేతులు ఉండవు కాబట్టి నేరుగా తింటాయి. కానీ దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చాడు. కుడి చేతితో ప్రసాదాన్ని తీసుకొని ఎడమ చేతిలోకి మార్చుకొని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకొని తినాలి. అలా కాకుండా కుడి చేతిలోకి తీసుకొని ఒకేసారి నోటితో తింటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతున్నారు.