Viral Video : కింగ్ కోబ్రా గురించి తెలుసు కదా. మామూలు తాచు పాము వేరు… నాగు పాము వేరు.. కింగ్ కోబ్రా వేరు. కింగ్ కోబ్రా అంటే కూడా నాగు పాము జాతికి చెందిన పామే కానీ.. ఇది చాలా పొడవుగా ఉంటుంది. చాలా బరువుతో ఉంటుంది. దాదాపు 20 అడుగుల వరకు ఈ పాము ఉంటుంది. అందుకే దాన్ని చూస్తేనే చాలామంది భయపడిపోతారు. పైథాన్ తరహాలో ఉంటుంది ఈ పాము. మరి అలాంటి పామును చూస్తే భయపడకుండా ఉంటామా? జడుసుకుంటాం కదా.
మరి అలాంటిది అటువంటి కోబ్రాను ఓ యువతి ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటది. అది కూడా లిప్ టు లిప్ కిస్ ఇస్తే ఎలా ఉంటది. అసలు అలాంటి ఘటన జరుగుతుంది అని కూడా ఊహించలేం కదా. కానీ.. ఓ యువతి దాన్ని సాధ్యం చేసి చూపించింది. ఆ యువతి లిప్ కిస్ పెడుతుంటే పాము కూడా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : ముద్దు పెడుతున్నా కాటేయని పాము
అసలు కింగ్ కోబ్రాల దగ్గరికి మనుషులు వెళ్తే చాలు వాళ్లను కాటేయడానికి ప్రయత్నిస్తాయి. పడగ విప్పి బుసలు కొడతాయి. కానీ.. ఈ యువతి మాత్రం ఎలాంటి భయం లేకుండా… ఎలాంటి బెరుకు లేకుండా కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టింది. కోబ్రాకు ముద్దు పెడుతుంటే ఆ యువతిని కాటేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది కోబ్రా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. అసలు ఆ యువతికి ఎంత ధైర్యం, ఎంత సాహసం ఎలా చేసింది. అలా ఎలా కోబ్రాకు ముద్దు పెట్టింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.