Bottle Gourd Benefits : సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కూరగాయలన్నింటిలోకెల్లా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. దీనిని తెలంగాణలో అనపకాయ అని కూడా అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినది… దీని శాస్త్రీయ నామ లజనేరియా వర్గారీస్ అంటారు. దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కాయలో పొటాషియం, ఐరన్, తో పాటు విటమిన్ కూడా అధిక పరిమాణంలో ఉంటాయి.
మానవ శరీరంలో వృద్ధి చెందిన విష పూరిత వ్యర్ధాలను మరియు మలినాలను బయటకు తొలగింప చేయడంలో ఈ కాయ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిలో సహజ సిద్ధంగా ఉన్న మత్తును కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గటంతో పాటు నిద్ర త్వరగా పోతారు. సొరకాయ రసం రోజు తాగడం వల్ల మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. సొరకాయ ఆరోగ్యపరంగానే కాకుండా జుట్టు సమస్యలు కూడా దూరం చేస్తుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తరచుగా ఒక గ్లాస్ సొరకాయ రసం తాగితే జుట్టు నలుపు రంగులోకి వచ్చే అవకాశం ఉంటుందట.
Bottle Gourd Benefits : రోజు సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే… ఇక మీరు వదిలిపెట్టరు.

సొరకాయ తినటానికే కాకుండా ఈత కొట్టడానికి సొరకాయ బుర్ర ఎంతో సహాయపడుతుంది. గత కాలంలో సొరకాయలు నీరు పోసుకుని తాగే వారట. దీనిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో ఉన్న వేడిని తొలగించి చల్లదనాన్ని కలిగించి శరీరానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. హై బీపీ ఉన్నవారు సొరకాయ తినడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. రెగ్యులర్ గా సొరకాయ తినడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. దీని ఫలితంగా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. దీనిని తినడం వల్ల శరీరంలో ఉన్న కొలెస్ట్రాలను తొలగించి బరువు తగ్గేలా సహాయపడుతుంది