Viral Video : అమ్మాయిలు అంటే అల్లాటప్పా కాదు ఇప్పుడు. వాళ్లకు ఉన్న ధైర్యం ఎవ్వరికీ లేదు. వాళ్లంటే చులకనగా చూడొద్దు. ఒకప్పుడు మహిళలు అంటే ఏ పని చేయలేరు అని.. వాళ్లు ఎదురు తిరగలేరు అని అనుకునేవారు. అందుకే వాళ్లపై ఎక్కువగా అఘాయిత్యాలు జరిగేవి. వాళ్లపై దాడులు జరిగేవి. అందుకే మహిళలు ఎక్కువగా అప్పట్లో బయటికి వెళ్లేవారు కాదు. ఇంట్లోనే ఉండేవారు. రాత్రి అయితే ఒంటరిగా బయటికి వెళ్లడానికి భయపడేవారు. కానీ.. ఇప్పటి పరిస్థితులు అలా లేవు. మహిళలకు ధైర్యం వచ్చింది. బయట పోలీసులు, ప్రజల సపోర్ట్ కూడా ఉంది. అందుకే.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటున్నారు.

అలాగే.. ప్రస్తుతం మహిళల కోసం చాలా చట్టాలు వచ్చాయి. వాళ్లను పరిరక్షించడం కోసం ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. దీంతో కాస్తో కూస్తో అయినా వాళ్ల మీద జరిగే దాడులు తగ్గుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట ఇంకా వాళ్ల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల కోసం వచ్చిన చట్టాలను కొందరు మహిళలు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తున్నాం. తాజాగా ఓ ఆటోడ్రైవర్ పై నలుగురు యువతులు విరుచుకుపడిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : చొక్కా చిరిగేలా కొట్టి అవమానించారు
ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది. దినేష్ అనే ఆటోడ్రైవర్.. ఎయిర్ పోర్ట్ లో ఉండే రాహుల్ ట్రావెల్స్ కంపెనీకి తన ఆటోను నడిపాడు. కొన్ని రోజులు నడిపాక.. అతడికి ఆ ట్రావెల్ కంపెనీ జీతం ఇవ్వలేదు. దీంతో చాలా సార్లు ఆ ట్రావెల్స్ కంపెనీకి వెళ్లి జీతం కోసం అడిగాడు. ఒకరోజు జీతం కోసం వెళ్లగా మేనేజర్ లేకపోవడంతో అతడి నెంబర్ కావాలని.. ట్రావెల్ ఆఫీసులో ఉన్న మహిళా ఉద్యోగులను అడిగాడు. దీంతో ఆ మహిళలు నెంబర్ ఇవ్వలేదు. వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళలు అతడిపై దాడి చేయడం స్టార్ట్ చేశారు. బెల్ట్ తో అతడిని చితకబాదారు. చొక్కా చింపారు. అతడిపై మహిళలు విరుచుకుపడటంతో అక్కడి వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Raipur- The young man was beaten with a belt by the women at Swami Vivekananda Airport, Raipur.#Raipur #Airport #chhattisgarh #ViralVideo pic.twitter.com/BiGQM3k5EC
— Chaudhary Parvez (@ChaudharyParvez) September 19, 2022