Viral Video : సముద్రంలో కొన్ని కోట్ల జీవులు ఉంటాయి. అందులో చేపలు చాలా ముఖ్యమైనవి. కొన్ని వేల, లక్షల రకాల చేపలకు సముద్రం నిలయం. మనకు తెలియని ఎన్నో వింత జీవులు సముద్రంలో నివసిస్తుంటాయి. ఈ భూమ్మీద మనుషులు నివసిస్తుంటారో.. ఎలా జీవనం సాగిస్తుంటారో.. సముద్రంలో కూడా అంతే. జీవులకు సముద్రమే ఇల్లు. అదే వాటి జీవన గమనం. సముద్రం నుంచి బయటికి రావు. అందులోనే పుడతాయి.. అందులోనే చనిపోతాయి.
ఒక్కోసారి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు రకరకాల చేపలు వలలో చిక్కుతుంటాయి. కొన్ని అరుదైన చేపలు అయితే.. మరికొన్ని వింత చేపలు, డేంజర్ చేపలు. తాజాగా మత్స్యకారులకు ఓ డేంజర్ చేప చిక్కింది. దాని పొడవు ఏకంగా 16 అడుగులు. చాలా పెద్దగా ఉన్న ఈ చేపను ఓర్ ఫిష్ అంటారట. సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి క్రేన్ తో దాన్ని వేలాడదీశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video : ఆ చేపను చూసి హడలిపోతున్న జనాలు
నిజానికి ఓర్ చేప కనిపించడం మంచిది కాదట. అపశకునం అట. ఆ చేప కనిపిస్తే సునామీ, భూకంపాలు వస్తాయట. అందుకే దాన్ని ఎర్త్ క్వేక్ చేప అని కూడా పిలుస్తారు. ఈ చేప చిలీలోని అరికాలో బీచ్ కు కొట్టుకొచ్చింది. దాన్ని క్రేన్ తో వేలాడదీశారు. నిజానికి.. ఈ జాతి చేపలు సముద్రం అడుగున జీవిస్తాయి. చనిపోయినప్పుడు ఇలా సముద్రం పైన తేలుతూ.. ఒడ్డుకు కొట్టుకొస్తాయి. సాధారణంగా ఒక ఓర్ ఫిష్ 11 మీటర్ల పొడవు ఉంటుంది. తాజాగా కనిపించిన ఓర్ చేప.. 5 మీటర్ల పొడవు ఉంది.
అయితే.. ఈ చేపలు సముద్రగర్భం లోతుల్లో అడుగున జీవిస్తాయని.. సముద్రం భూపొరల్లో కదలికలు వస్తే అవి సముద్రం పైకి వస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఇవి కనిపించాయంటే సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు భయపడతారు జనాలు.