Health Benefits : సాధారణంగా పిల్లల నుండి పెద్దల వరకు మటన్ కంటే చికెన్ బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా వీటితో పాటు వచ్చే లివర్ ను కూడా చాలామంది ఫ్రై రూపంలో తీసుకుంటారు. మటన్ లివర్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ చికెన్ లివర్ తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. మటన్ లివర్ కంటే, చికెన్ లివర్ లో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. చికెన్ లివర్ ను ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని దీనిని దూరం పెడతారు. వాస్తవానికి చికెన్ లివర్ ను తినడం వల్ల ఎటువంటి హాని కలగదని వైద్య నిపుణులు తెలియజేశారు. చికెన్ లివర్ తినడానికి అన్ని దేశాల వారు ఎంతో ఆసక్తి చూపుతారు.
చికెన్ లివర్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందిస్తాయి. ఈ లివర్ ను తినడం వల్ల మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. 250 గ్రాముల ఉడికించిన చికెన్ లివర్ ను తీసుకుంటే 20 మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తుంది. దీనివల్ల శరీరంలో రక్తం శాతం బాగా పెరిగి, రక్తహీనత నుంచి బయటపడవచ్చు. పాలు, గుడ్డు, మటన్ ,ఫిష్ కంటే చికెన్ లివర్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. 250 గ్రాములు చికెన్ లివర్ లో 20.2 మిల్లీ గ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. ఈ లివర్ రోగనిరోధక శక్తిని పెంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి లోపల ఉన్న రెటీనాల్ ను శక్తివంతంగా చేస్తుంది. ఈ లివర్ లో విటమిన్ బి2 ఎక్కువగా ఉంటుంది. 200 గ్రాముల లివర్ లో 1.5 మిల్లీగ్రాముల విటమిన్ బి2 లభిస్తుంది.
Health Benefits : చికెన్ లివర్ కర్రీ గురించి తెలిస్తే….. ఇక మీరు వదలరు.

ఇది శరీర మెటబాలిజంను అధికం చేస్తుంది. అంతేకాకుండా మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం చేస్తుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు దృఢంగా ఉంటాయి. రక్త సరఫరా బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చికెన్ లివర్ కర్రీలో పొటాషియం, జింక్ ,క్యాల్షియం ,ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ,కండరాలను బలంగా ఉంచుతాయి. పురుషుల్లో జింకు వల్ల వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చికెన్ లివర్ మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందజేస్తాయి. కావున ఈ లివర్ ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.