Viral Video : లవర్ తో కలిసి యువతి బైక్ పై షికారు.. వెంబడించి మరీ పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video : ఒక సంసారం ఆగమైందంటే దానికి కారణం ఆర్థిక ఇబ్బందులు అయినా అయి ఉండాలి లేదంటే వివాహేతర సంబంధం అయినా అయి ఉండాలి. ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీంతో వాళ్ల కాపురం నాశనం అవుతోంది. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా జనాలు వివాహేతర సంబంధం కోసం పాకులాడుతున్నారు. ఫలితంగా జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు.

Advertisement
husband catches wife with lover in uttar pradesh agra video viral
husband catches wife with lover in uttar pradesh agra video viral

వేరే వ్యక్తి మోజులో పడితే ఇక సొంత పిల్లలు, భార్య, భర్త, కుటుంబం, పేరెంట్స్ అన్నీ మరిచిపోయి ఆ వ్యక్తి కోసమే కొందరు జీవిస్తుంటారు. కానీ.. ఆ ఒక్కరి వల్ల మొత్తం సంసారమే ఆగమైపోతుందని మాత్రం గ్రహించరు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Viral Video : పెళ్లయి పిల్లలు ఉన్నా ప్రియుడి మైకంలో పడిపోయిన యువతి

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగ్రాకు చెందిన ఓ యువతికి 10 ఏళ్ల క్రితం ఓ యువకుడితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఒక కూతురు ఉంది. అయితే.. కొన్నేళ్ల నుంచి ఆ మహిళ ఓ వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో తనను మరోసారి అలాంటి పని చేయొద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. రోజూ గొడవలు జరగడం కామన్ అయిపోయింది. ఇటీవల కూడా ఓసారి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో తన భర్త, కూతురును వదిలేసి ఆ మహిళ.. వెళ్లిపోయింది. వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసి రావాలని చెప్పింది. తను ఎటు వెళ్తుందో అని తన భర్త కూడా ఆమెను ఫాలో అయ్యాడు. ప్రియుడు రాగానే అతడి బైక్ ఎక్కి వెళ్లిపోయింది. దీంతో వెంటనే కూతురును తీసుకొని స్కూటీపై వాళ్ల బైక్ ను ఫాలో చేసి మరీ ఇద్దరినీ రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. నడిరోడ్డు మీదనే తన భార్య, ఆమె ప్రియుడిని చెప్పుతో చితకబాదాడు భర్త. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement