Viral Video : మొసలికి ఎంత బలం ఉంటుందో తెలుసు కదా. నీళ్లలో కాలు పెడితే చాలు.. ఎంతటి జంతువును అయినా తమ నోటితో నీళ్లలోకి లాక్కెళ్లే బలం వాటి సొంతం. అలాంటిది అంత భారీ మొసలినే ఓ చిరుతపులి ఒకే ఒక్క దెబ్బతో చంపేసింది. తన మెడను పట్టి పళ్లతో కొరికేసి నీళ్ల నుంచి బయటికి తీసుకొచ్చి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాగ్వార్ అంటే తెలుసు కదా.. చిరుత జాతిలో మచ్చలు ఉండే చిరుత పులి అది. అది పరిగెత్తినట్టుగా ఇక ఏ జంతువు పరిగెత్తలేదు. దాని ఫోకస్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. చెట్టు మీద కూర్చొని ఉన్న ఓ చిరుత పులి.. నీళ్లలో ఉన్న మొసలిపై ఫోకస్ పెట్టింది. నీళ్లలో ఉన్న మొసలిని నీళ్లలోకి అమాంతం దూకి దానిపై ఎగబడి ఒకే ఒక్క దెబ్బతో చంపేసింది.
Viral Video : జాగ్వర్ పంచ్ అంటే అలా ఉంటది
జాగ్వర్ పవర్ ఏంటో అందరికీ తెలుసు. అది ఏ జంతువును అయినా ఒకే ఒక దెబ్బతో చంపేయగలదు. అందుకే ఆ జాతి చిరుతలకు ఆ పేరు వచ్చింది. తాజాగా మొసలిని అది వేటాడిన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నీళ్లలో ఉన్న మొసలిని ఒకే ఒక దెబ్బతో చంపేసింది చిరుత. తర్వాత దాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. అంత పెద్ద మొసలిని ఒక ఉదుటున దాని మీదికి దూకి అలా ఎలా చంపేసింది. దానికి అంత పవర్ ఉంటుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
View this post on Instagram