Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తు వేసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం కృష్ణంరాజు గారి మరణ వార్త తెలుగు ప్రేక్షకులను కలచివేసింది. ఆయన మరణాన్ని ప్రభాస్ మరియు కృష్ణంరాజు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా ప్రభాస్ తన పెదనాన్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఇంకా అదే బాధలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తన నమ్ముకున్న డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నష్టపోకుండా తను చేసిన ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్ మూవీ షూటింగ్లో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ తన పెదనాన్నని ఎంతగా ఆరాధిస్తాడో గౌరవిస్తారు అందరికీ తెలిసేలా వీడియోని తయారు చేశారు. నిజానికి కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో మనం చూశాం. కానీ అందరూ ప్రభాస్ షేర్ చేసిన ఈ వీడియోని బాగా అభిమానిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు తుది శ్వాస విడిచిన తర్వాత ప్రభాస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి చేసిన తొలి పోస్ట్ ఇదే. ఈ పోస్ట్ చేయగానే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది.
Prabhas : ప్రభాస్ తన పెదనాన్న మరణం తర్వాత తొలిసారి చేసిన పోస్ట్….

అంతేకాకుండా ప్రభాస్ షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఈ వీడియోలో కృష్ణంరాజు చేసిన పాత్రలకు తన పాత్రను మ్యాచ్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రెబల్ స్టార్ అభిమానులు ఈ వీడియోని తయారు చేశారు. ఈ వీడియోని ప్రభాస్ తన ఇనిస్టాగ్రమ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఈ వీడియోని తయారు చేసిన తన అభిమానులకు థాంక్స్ చెప్పాడు. వీళ్ళు తయారు చేసిన సింబల్ కు హార్ట్ సింబల్ ను జోడిస్తూ ఇంకా వారికి నమస్కారం చేస్తూ షేర్ చేసిన ఈ వీడియో ద్వారా అభిమానులపై తనకున్న గౌరవాన్ని మరోసారి రుజువు చేశారు. కాగా ప్రభాస్ తన పెదనాన్న కోసం షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ట్రేడింగ్ అవుతుంది.
View this post on Instagram