Viral Video : మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామ శివారులోకి అనుకోకుండా ఓ చిరుత పులి వచ్చింది. అయితే మొదట చిరుతను చూసి భయాందోళనకు గురైన జనాలు చిరుత ఆవేశంగా, హుషారుగా లేకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో దాని దగ్గరికి వెళ్లి పరీక్షించగా చిరుత అనారోగ్యానికి గురైనట్లుగా అర్థమైంది. ఇక దీనిని అదునుగా భావించిన మనుషులు చిరుతను పెంపుడు జంతువు లాగా భావించి ఆటపట్టించారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకెళ్తే…దేవాస్ జిల్లా ఇక్లేరా సమీపంలో గల అడవి నుండి ఓ చిరుత సంచరిస్తూ గ్రామ శివారుకు వచ్చింది. ఇక దానిని చూసిన గ్రామస్తులు భయాందోళనతో దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటి తర్వాత చిరుత దూకుడుగా లేకుండా నీరసంగా ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అది అస్వస్థకు గురైనట్లు అర్థమైంది. దీంతో అక్కడున్న వారంతా చిరుత పులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. పెంపుడు జంతువు వలె దానిని ఆటపట్టించారు. అంతేకాక కొందరు దానిపై ఎక్కి రైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. దాని చుట్టూ చేరి సెల్ఫీలు దిగుతూ దానిని ఇబ్బందికి గురి చేశారు. ఇంతలో సమాచారం తెలుసుకున్న అటవీశాఖ ఇక్లేరా ప్రాంతానికి చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
రెండేళ్ల వయసుగల చిరుత పులిని చికిత్స కోసం భోపాల్ లోని వాన్ విహార్ కు తరలించినట్లు అడవి శాఖ అధికారి సంతోష్ శుక్ల తెలియజేశారు. కొద్ది రోజుల్లోనే అది పూర్తిగా కోలుకుంటదని తెలియజేశారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిరుతపులిని ప్రజలు చాలా ఇబ్బందికి గురి చేశారని ఆయన అన్నారు. చిరుత నడవలేని పరిస్థితిలో ఉన్నందున వారి ఆటలు సాగాయని లేకుంటే వేరేలా ఉండేదని తెలియజేశారు. ఎంత అసహనంగా ఉన్నప్పటికీ అడవి జంతువులతో ప్రజలు ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. అభివృద్ధి ముసుగులో ఇప్పటికే జంతువుల స్థలాలను ఆక్రమిస్తున్నాం… ఇక ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాం. కొంచెం అన్న సిగ్గుండాలి అంటూ వీడియో చూసిన నేటి జనులు కామెంట్స్ చేస్తున్నారు.
VIDEO | Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. “A team from Ujjain is reaching to capture the leopard and the animal will be shifted based on the directions of the higher officials,”… pic.twitter.com/NHpS0f1Mx6
— Press Trust of India (@PTI_News) August 30, 2023