Viral Video : జాతీయ జెండాతో స్కూటీని క్లీన్ చేశాడు.. ఇతడిని కఠినంగా శిక్షించాలంటున్న నెటిజన్లు

Viral Video : జాతీయ జెండాను ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఏ దేశంలో అయినా ఆ దేశ పౌరులు ఖచ్చితంగా ఆ దేశ సార్వభౌమత్యాన్ని, ఆ దేశ నాగరికతను, ఆ దేశ పద్ధతులు, జాతీయ గీతం, జాతీయ జెండాను గౌరవిస్తారు. గౌరవించి తీరాల్సిందే. ఆ దేశంలో ఉన్నందుకు.. అక్కడ పుట్టి పెరిగినందుకు ఆ దేశానికి ఇచ్చే గౌరవం అది. మన భారతదేశంలోనూ అంతే. మన జాతీయ జెండాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అందరికీ తెలిసిందే. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎగురవేయొద్దు. దాన్ని కింద పడేయకూడదు. చింపేయకూడదు… తొక్కకూడదు.. ఎక్కడా విసిరేయకూడదు. ఇవన్నీ ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. ప్రతి ఒక్కరు జాతీయ జెండాను ఒక దేవుడిగా భావిస్తారు.

Advertisement
man cleans scooty with national flag video viral
man cleans scooty with national flag video viral

కానీ.. ఓ వ్యక్తి మాత్రం జాతీయ జెండాను గౌరవించడం పక్కన పెడితే జాతీయ జెండాతో తన స్కూటీని క్లీన్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంటి ముందు నిలిపి ఉన్న తన స్కూటీని జాతీయ జెండాతో శుభ్రం చేశాడు ఆ వ్యక్తి. భజన్ పురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Viral Video : ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు రెడీ అయిన పోలీసులు

తన స్కూటర్ ను జాతీయ జెండాతో శుభ్రం చేస్తూ ఆ వ్యక్తి కనిపించాడు. అతడిని చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఎదురు ఇంట్లో ఉన్నవాళ్లు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇటీవలే ఇండియాకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను దేశమంతా నిర్వహించుకున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేశాం. ఈనేపథ్యంలో బైక్ ను జాతీయ జెండాతో క్లీన్ చేయడంతో అతడిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వెంటనే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను వేడుకుంటున్నారు.

Advertisement