rashmika : హీరోయిన్ రష్మిక మందన గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఒక విషయంపై రష్మిక గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఛలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. కన్నడలో హీరోయిన్ గా మొదటి సినిమా చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ లోనే వెలుగుతుంది. తెలుగులో ‘ గీతాగోవిందం ‘, ‘ సరిలేరు నీకెవ్వరు ‘ సినిమాలు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇక అల్లు అర్జున్ కు జోడిగా నటించిన ‘ పుష్ప ‘ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయింది. ఈ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది.
rashmika : ఆ యంగ్ హీరో రష్మికను పడేయాలని తెగ ట్రై చేస్తున్నాడుగా… అమ్మడు ఏమంటుందో…
విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో విజయ్ తో లవ్ లో పడిన రష్మిక రియల్ లైఫ్ లో కూడా లవ్ లో ఉందని ప్రచారం జరిగింది. రష్మిక, విజయ్ కలిసి నటించిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో ముద్దులు పెట్టుకొని రెచ్చిపోయారు. నిజంగా ప్రేమికుల్లాగానే వెండి తెరమీద ప్రేక్షకులను అలరించారు. దాంతో అటు సినీ వర్గాలలో, ఇటు ప్రేక్షకులలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని మాట్లాడుకుంటున్నారు. అయితే కొందరు ఇండస్ట్రీలోని జనాలు రష్మిక మందనను విజయ్ నిజంగా ప్రేమించాలని ప్రయత్నం చేసినట్లుగా గుసగుసగా వినిపిస్తున్నాయి.

కారణం ఏమై ఉంటుందో కానీ ప్రేమ వరకు వెళ్లలేదని సమాచారం. కానీ వీలు కుదిరినప్పుడల్లా వీరిద్దరూ నైట్ డిన్నర్లకు, పబ్బులకు వెళుతున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ‘ లైగర్ ‘ సినిమా షూటింగ్ ముంబైలో జరిగినప్పుడు రష్మిక తో కలిసి విజయ్ రెస్టారెంట్లకు బాగానే తిరిగాడు. ఇవన్నీ చూస్తే విజయ్ గట్టిగానే రష్మిక కోసం ట్రై చేస్తున్నాడు గాని రష్మిక మాత్రం జస్ట్ ఫ్రెండ్ షిప్ వరకే అన్నట్టుగా లిమిట్స్ పెట్టిందని టాక్. ఏమో చెప్పలే నాగచైతన్య, సమంత ఇలా ఉండే సడన్ గా పెళ్లి చేసుకుంటున్నామని షాక్ ఇచ్చారు. వీరు కూడా అలాంటి షాక్ ఇస్తారేమో చూడాలి..