Naga chaitanya : ప్రస్తుతం వరస ప్లాప్ లతో సతమవుతమవుతున్న హీరో నాగచైతన్య పర్సనల్ లైఫ్ లో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న వార్త సంచలనగా మారిన విషయం తెలిసిందే. అయితే వీరి విడాకులు వెనుక సుమంత్ అక్క సుప్రియ ఆర్లగడ్డ జోక్యం ఉన్నట్లు కథనాలు వినిపించాయి. అయితే ఇటీవల నాగచైతన్య మరియు సుప్రియ కలిసి బయటకు వెళ్ళగా అక్కడ అనుకోకుండా సమంత విషయంలో ఓ ఘటన చోటు చేసుకుందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే సెప్టెంబర్ 1న సమంత నటించిన ఖుషి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరియు నాగచైతన్యకు సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల సుప్రియ నిర్మాణంలో రీసెంట్ గా విడుదలైన సినిమా బాయ్స్ హాస్టల్. కాగా ఈ సినిమా ప్రీమియర్ షోలో పాలుపంచుకున్నారు నాగచైతన్య. ఈ క్రమంలో ఈ సినిమా మధ్యలో ఖుషి సినిమా ట్రైలర్ వచ్చిందట. దీంతో ఆ టైలర్ చూసిన నాగచైతనే వెంటనే కోపంతో బయటకు వచ్చేసారట. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ ఈ వార్తలపై స్పందించడం జరిగింది. కావాలని ఇలాంటి రూమర్స్ ను సృష్టిస్తున్నారని తాను ధియేటర్ నుంచి బయటకు రాలేదని ఇది ఫేక్ న్యూస్ అని నాగచైతన్య స్పష్టం చేశారు. అంతేకాక ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించవద్దని సదరు మీడియా ఈ వార్తలను సరి చేసుకోవాలంటూ నాగచైతన్య తెలియజేశారు.
అయితే నాగచైతన్య సమంత పర్సనల్ విషయానికొస్తే వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన మూడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు.అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతం మీరిద్దరూ ఎవరు కెరియర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయినప్పటికీ మీడియాలో వీరిద్దరి గురించి ఏదో ఒక వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు.