Viral Video : ఆవుపై కుక్క దాడి.. వామ్మో.. ఈ కుక్కకు ఏమైంది.. ఆవుపై అంత క్రూరంగా ప్రవర్తించింది

Viral Video :  ఆవు గురించి తెలుసు కదా. అది చాలా సాధు జంతువు. దానికి కోపం వస్తే కానీ.. దానికి కోపం తెప్పిస్తే కానీ.. వేరే జంతువులపై, మనుషులపై అటాక్ చేయదు. హిందువులు ఆవును తల్లిగా, దేవతగా భావిస్తారు. ఆవుకు పూజలు కూడా చేస్తారు. అది ఆవుకు ఉన్న గొప్పతనం. కానీ.. ఒక ఆవుపై ఓ కుక్క విరుచుకుపడింది. మామూలుగా కాదు.. ఆవుపై ఎంతో పగ, కోపం ఉన్నదానిలా దానిపై అటాక్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
pitbull dog attacked by cow in kanpur video viral
pitbull dog attacked by cow in kanpur video viral

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. షార్సయ్య ఘాట్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ మొత్తం మునిగిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాన్పూర్ కూడా భారీ వర్షాలు, వరదలకు మునిగిపోయింది. ఈనేపథ్యంలో భారీ వరదలోనే ఓ కుక్క.. అక్కడే ఉన్న ఆవును పట్టేసింది. తన దవడను పట్టేసి తన పళ్లతో కొరికేసింది.

Advertisement

Viral Video : అక్కడి స్థానికులు ఎంత ప్రయత్నించినా ఆవును వదలని కుక్క

ఆవు దవడను తన పళ్లతో పట్టేసింది కుక్క. దీంతో ఆవు గింజుకుంది. ఆవు ఎంత గింజుకున్నా అస్సలు కుక్క మాత్రం వదల్లేదు. అది అసలే పిట్ బుల్ అనే జాతికి చెందిన కుక్క కావడంతో దాన్ని చూసి అక్కడి స్థానికులు కూడా భయపడ్డారు. అక్కడికి వెళ్లి కుక్క బారి నుంచి ఆవును తప్పించడం కోసం ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఆ కుక్క మాత్రం దాన్ని వదల్లేదు. చివరకు ఓ కర్ర తెచ్చి కుక్కను కొట్టడంతో అప్పుడు ఆ కుక్క ఆవును వదిలేసింది. దీంతో ఆవు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. ఈ కుక్క ఏందిరా బాబు.. ఇంత భయంకరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement