Viral Video : భారీ భూకంపం ధాటికి రోడ్డు ఎలా అయిపోయిందో చూడండి.. భూకంపాలు వస్తే రోడ్లు ఇలా అయిపోతాయా?

Viral Video : భూకంపం గురించి తెలుసు కదా. మన దగ్గర భూకంపం అంతగా రాదు. ఎప్పుడో ఒకసారి అలా భూమి కంపించినట్టు అనిపిస్తుంది కానీ.. మన దగ్గర భారీ స్థాయిలో భూకంపాలు రావడం ఇప్పటి వరకు అయితే చూడలేదు. అందుకే భూకంపాలు వస్తే ఏమౌతుంది.. ఎంత నష్టం సంభవిస్తుంది అనేది మనకు తెలియదు. కానీ.. కొన్ని దేశాల్లో అయితే ఎప్పుడూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. అక్కడ భూకంపాలు రావడం కామన్. భూకంపం వస్తుందని తెలియగానే.. ఇళ్లలో ఉన్నవాళ్లంతా ఒక్క ఉదుటున బయటికి వస్తారు. తీర ప్రాంతాల్లోనూ భూకంపం ఎక్కువగా వస్తుంటుంది. సముద్రాల్లో భూకంపాలు వాడం వల్లే సునామీలు ఏర్పడుతాయి. సునామీల వల్ల ఎన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారో మనం చాలా సార్లు చూశాం. ఎందరో నిరాశ్రయులు అయ్యారు.

Advertisement
roads collapsed after massive earthquake in papua new guinea
roads collapsed after massive earthquake in papua new guinea

తాజాగా పవువా న్యూ గునియా అనే దేశంలో ఆదివారం భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదు అయింది. కైనంతు అనే టౌన్ లో 90 కిలో మీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు.. అక్కడి నుంచే భూకంపం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం ధాటికి ఐదుగురు వ్యక్తులు చనిపోగా.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Advertisement

Viral Video : భూకంపం వల్ల విరిగిపడిపోయిన కొండచెరియలు

భూకంపం ధాటికి కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో కొండచెరియలు విరిగి పడ్డాయి. అలాగే.. సునామీ వార్నింగ్ ను కూడా అక్కడ ప్రకటించారు. ఇక భూకంపం వల్ల రోడ్లు మొత్తం బీటలు పట్టాయి. రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్లు పగిలిపోయిన రెండుగా చీలిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భూకంపం ధాటికి పూర్తిగా ధ్వంసమైపోయిన రోడ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ వీడియోలను చూసి షాక్ అవుతున్నారు. నిజానికి.. పపువాలో భూకంపాలు చాలా కామన్. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతానికి సమీపంలోనే ఈ దేశం ఉంటుంది. ఆ ప్రాంతం భూకంపాలను నెలవు. అందుకే.. ఇక్కడ భూకంపాలు వస్తూనే ఉంటాయి. 2018 లో అక్కడ వచ్చిన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది.

7.6 earthquake in Papa New Guinea. The earth literally opened up from interestingasfuck

Advertisement