Hair care Tips : ఈరోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ఎయిర్ పాల్ కావడం, జుట్టు రాలడం నేటి కాలంలో ఒక సమస్యగా మారింది. ఎందుకంటే జీవనశైలిలో మార్పులు, ఆహార పదార్థాల అలవాట్లు వల్ల జుట్టు రాలే సమస్యలు అక్కడ నుండే మొదలవుతాయి. కానీ మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే అది ఆందోళన కలిగించే విషయమమే. జుట్టు రాలే సమస్యలు తగ్గించుకోవడానికి ఎన్నో ఇంటి చిట్కాలు ఉన్నాయి. జుట్టు రాలే సమస్య నుండి ఎలా బయటపడవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. మనం తాగే గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫైనాల్స్ అధిక పరిమాణంలో ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ బి సి ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇది దురద, చుండ్రు ,బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు గ్రీన్ టీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
జుట్టు పెరుగుదల చర్మానికి చాలా వరకు సహాయపడుతుంది. అంతేకాకుండా పోషకాల సరఫరా, ఆక్సిజన్ పెంపొందిస్తుంది. జుట్టు పెరిగేలా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య దూరం చేసుకోవడానికి రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ ని తీసుకోవాలి. గ్రీన్ టీ ని ఒక క్లాస్ నీటిలో మరిగించి. ఆ తర్వాత జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసి ఏదైనా షాంపుతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ అయ్యి జుట్టు బాగా పెరుగుతుంది. కుదురుల మూలాలకు పోషణ ఎంతో అవసరం. దీనికోసం కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేయాలి.
Hair care Tips : మీ జుట్టు మెరిసేలా పొడవుగా పెరగాలంటే… అద్భుతమైన చిట్కాలు

అలాకాకుండా, లావెండర్, మందారం, గుమ్మడి గింజల నూనెను కొబ్బరి నూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయవచ్చు. రాత్రంతా అలానే ఉంచి ఉదయం ఏదైనా షాంపుతో తలస్థానం చేయాలి. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అధికంగా ఉంటాయి. కలబంద జుట్టుకు అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని చాలామంది నమ్మకం. ఇది జుట్టు రాలే సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇలా కలబంద వారానికి ఒకటి రెండు సార్లు జుట్టుకి అప్లై చేస్తే మీ జుట్టు అందంగా మెరిసేలా పొడవుగా పెరుగుతుంది.